బీహార్
బీహార్ ఎన్నికల తొలి దశ విజయవంతంగా ముగిసినప్పటికీ, రాజకీయ వాతావరణంలో నెలకొన్న తీవ్ర ఒత్తిడి, ఉత్కంఠ మధ్య తెరవెనుక జరుగుతున్న ఓ చీకటి బాగోతం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ నిర్వహించిన ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్ పేరుతో బయటపడిన రహస్యాలు.. ఎన్నికల సమయంలో కొందరు నాయకులు, వీఐపీలు తమ విలాసాల కోసం ఎలా ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారో వెల్లడించాయి.
ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాట్నాలోని హోటల్ బెల్లీ గ్రాండ్ ప్రధాన కేంద్రంగా ఉందని ఆ స్ట్రింగ్ ఆపరేషన్‌లో తేలింది. పంచాయతీ నాయకుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులకు, వీఐపీలకు డిమాండ్‌ను బట్టి ఒకేసారి 100 మంది వరకు యువతులను సరఫరా చేసే నెట్‌వర్క్ ఇక్కడ చురుకుగా పని చేస్తోంది.
ఈ నెట్‌వర్క్ కేవలం బీహార్‌కే పరిమితం కాలేదు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచే కాక, నేపాల్, థాయ్‌లాండ్ వంటి విదేశాల నుంచి కూడా యువతులను రప్పిస్తున్నట్లు గుర్తించబడింది.
ఈ నెట్‌వర్క్‌లో పేదరికంలో ఉన్న ప్రాంతాల నుంచి వచ్చిన యువతులకు, అలాగే ఇంగ్లీష్ మాట్లాడగలిగే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విదేశీ యువతులకు ప్రత్యేక ట్రీట్‌మెంట్, అదనపు ఫీజులు చెల్లించబడుతున్నట్లు సమాచారం. అమ్మాయిలతో పాటు డ్రగ్స్ డీల్స్ కూడా ఇదే నెట్‌వర్క్ ద్వారా జరుగుతున్నాయట. పగలు/రాత్రి/ఎక్స్‌ట్రా టైమ్ , అనుభవాన్ని బట్టి రేట్లు, రివార్డులు నిర్ణయించబడుతున్నట్లు తేలింది. ఈ బాగోతంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా వేదికలపై నీతి, నిజాయితీ గురించి ప్రసంగాలు చేస్తూ, తెరవెనుక ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న నాయకులపై మండిపడుతున్నారు. ప్రజల బాగోగులు చూడాల్సిన నాయకులు, ఇలాంటి విలాసాలకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.
Comments
Post a Comment