దిల్లీ నగరంలో ఘోర పేలుడు చోటుచేసుకుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపివున్న ఓ కారులో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఎల్‌ఎన్‌జేపీ (LNJP) ఆస్పత్రికి తరలించారు.
పేలుడు చోటుచేసుకున్న ప్రాంతంలో ఆందోళన నెలకొంది. వెంటనే దిల్లీ పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు.
అసలు ఈ పేలుడు ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఏడు ప్రత్యేక బృందాలు ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించి విశ్లేషిస్తున్నారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు అపోహలు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.

Comments
Post a Comment