జైభీమ్ రావ్ భారత్ పార్టీలోకి నూతన సభ్యుల చేరికలు:
జైభీమ్ రావ్ భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ ఆదేశాల మేరకు, ఈరోజు తాడిపత్రి నియోజకవర్గంలో పార్టీలోకి నూతన సభ్యుల ఆహ్వాన కార్యక్రమం ఘనంగా జరిగింది. తాడపత్రి నియోజకవర్గం ఇంచార్జ్ చుట్టా ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, దాదాపు 10 మంది యువకులు, జైభీమ్ రావ్ భారత్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. ఈ సందర్భంగా చుట్టా ప్రసాద్ వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
సమాజ సేవకు అంకితభావంతో పనిచేయాలి
నూతనంగా చేరిన సభ్యులను ఉద్దేశించి నియోజకవర్గం ఇంచార్జ్ చుట్టా ప్రసాద్ మాట్లాడుతూ...
జైభీమ్ రావ్ భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ దిశానిర్దేశంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు.
సమాజంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణే జైభీమ్ రావ్ భారత్ పార్టీ లక్ష్యమని, జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్. ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్క కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
పార్టీలో చేరిన యువకులు ఇకపై జైభీమ్ రావ్ భారత్ పార్టీ భావజాలాన్ని, లక్ష్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.
నూతన సభ్యులు మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి, సామాజిక న్యాయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని, నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పాటుపడతామని ప్రతిన పూనారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఈ చేరికలు పార్టీకి మరింత బలాన్ని చేకూర్చాయని నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చుట్టా ప్రసాద్ తాడిపత్రి నియోజకవర్గం అధ్యక్షులు, దిద్దే కుంటే రమేష్ నియోజవర్గ ప్రధాన కార్యదర్శి, శ్యాంబాబు కరుణాకర్, ఈశ్వర్ రెడ్డి, విష్ణు,, వీరాఅంజనేయులు. బాలకృష్ణ. తదితరులు పాల్గొన్నారు

Comments
Post a Comment