పుస్తకం ఒక మంచి నేస్తం.
ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో శనివారం 58 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. చినిగిన చొక్కా అయినా తొడుక్కో - ఒక మంచి పుస్తకం కొనుక్కో అని ఒక మంచి మాట తో పుస్తకం విలువను పుస్తకం ఆవశ్యకతను గురించి తెలుపుతూ - పుస్తక ము ఒక మంచి నేస్తం అని పుస్తకాలను చదివే అలవాటు చిన్నప్పటినుంచే అలవర్చుకోవాలని , నేటి చరిత్ర భావితరాలకు అందించే ఒక అద్భుతమైన రూపమే పుస్తకం, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని మనలో వెలిగించి ముందుకు నడిపే సాధనమే పుస్తకమని ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థినిి విద్యార్థులకు తెలియజేయడమైనది. ఈ పుస్తక ప్రదర్శన లో స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించిన పుస్తకాలు, విజ్ఞానానికి వినోదానికి సంబంధించిన పుస్తకాలు , ఆధ్యాత్మిక పుస్తకాలు, కవితలు- కథల పుస్తకాలు, ప్రదర్శించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి వై ప్రతాపరెడ్డి,H. M.
శ్యామ్ ఉపాధ్యాయులు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయ పాఠకులు ప్రజలు పాల్గొన్నారు.

Comments
Post a Comment