వజ్రకరూర్ పిహెచ్సి ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి.
సమిష్టి కృషితో కుష్టి వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం వజ్రకరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నిమ్మల వేణుగోపాల్, రాజేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించే కార్యక్రమం గురించి వైద్య అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రాం మేనేజ్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ….. ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలు, అపోహల గురించి అవగాహన కల్పించి, మండలం లో కుష్టు వ్యాధి గ్రస్తులను గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఈనెల 17వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపయిన్ (LCDC) ద్వారా 14 రోజులపాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి అందరినీ పరీక్షించి సర్వేలో కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి తక్షణమే వైద్య సౌకర్యాలు అందించాలన్నారు. అలాగే కుష్టు వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తిని ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్య సేవ అందించడం ద్వారా వ్యాధిని అరికట్టి, అంగవైకల్యం రాకుండా నివారించవచ్చని తెలియజేశారు. కాబట్టి మండలం లోని అన్ని అంగన్వాడి కేంద్రాలలో 02 నుండి 06 సంవత్సరాల వయసు పిల్లలకు మరియు అన్ని పాఠశాలలో పిల్లలను, అలాగే సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు, కుష్టువ్యాధి లక్షణాలపై అవగాహన కల్పించి , వైద్య పరీక్షలు నిర్వహించాలని మండల వైద్యాధికారి డాక్టర్ సర్దార్ వలి కి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ సర్దార్ వలి, సిహెచ్ఓ లక్ష్మీదేవి, ఆరోగ్య బోధకులు సత్యనారాయణ, ఎంపీహెచ్ఈఓ గురుప్రసాద్, సూపర్వైజర్ నాగ శంకర్, సుశీలమ్మ, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment