న్యూ ఢిల్లీ నవంబర్ 4:ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయటం ఎంతమాత్రమూ సరికాదని దేశ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్య దేశాలలో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను అందరూ గౌరవించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం రక్షణ
ఉత్తరప్రదేశ్‌కు చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ తనపై ప్రభుత్వం నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ... "రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1) (ఏ) ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయి" అని పేర్కొంది. విమర్శనాత్మక వార్తలు రాసిన సదరు జర్నలిస్టును అరెస్టు చేయకుండా అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణను మంజూరు చేసింది. పత్రికా స్వేచ్ఛ మరియు పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు మరోసారి తన నిబద్ధతను చాటుకుందని సీనియర్ జర్నలిస్ట్ మాలపాటి శ్రీనివాసులు, పులి హరి, ఆనంద్ పేర్కొన్నారు.

Comments
Post a Comment