పోలవరం నుండి నల్లమల సాగర్ రిజర్వాయర్ వరకు రెండు దశల్లో నిర్మాణం చేపడితే,నల్లమల సాగర్ రిజర్వాయర్ నుండి నీటిని శ్రీశైలం రిజర్వాయర్ లోకి ఎత్తి వస్తారా,లేక రివర్స్ పంపింగ్ ద్వారా బనకచర్లకు తీసుకెళ్తారా? లేక సోమశిల రిజర్వాయర్ కు తీసుకెళ్లాలా? అనే అంశం పై జలవనరుల శాఖా మాత్యులు నిమ్మల రామానాయుడు గారు చెప్పిన డొంక తిరుగుడు సమాధానం, తాటి చెట్టు ఎందుకు ఎక్కావు అంటే దూడకు గడ్డి కోయడానికి అన్నట్లుగా ఉంది.
పోలవరం-బనకచెర్ల డిపిఆర్ తయారు చేయడానికి ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను ఎందుకు రద్దు చేశారో నిజాయితీగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ శాఖ మంత్రి పైన ఉన్నది.
మంత్రిగారి డొంక తిరుగుడు సమాధానం ప్రజలలో మరింత గందరగోళాన్ని సృష్టించడానికి దోహదపడేలా ఉన్నది. ఈ వ్యాఖ్యలు ముమ్మాటికీ అవగాహనా రాహిత్యంతో చేసినవి తప్ప మరొకటి కాదు.
నిపుణులతో మాట్లాడిన తర్వాత టెండర్లు రద్దు చేశామని చెప్పారు,బాగానే ఉన్నది,కానీ ఏ నిపుణులు,ఏ ఇంజనీరింగ్ అధికారులు నల్లమల సాగర్ నుండి శ్రీశైలం జలాశయానికి,లేదా బనకచర్లకు తరలించే సూచనలు చేశారో చెప్పగలరా?
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల భారీ ఎత్తిపోతల పథకం లోప భూయిష్టమైనదని,కృష్ణా నదీ జలాలపై ఆంధ్ర ప్రదేశ్ కు ఉన్న హక్కులను ప్రమాదంలోకి నిడుతుందని చెప్పినా వినలేదు.చివరికి,ప్రజల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత చవిచూడాల్సి వచ్చింది. అయినా కూడా ఇంత గందరగోళంలో ఉండడం ఆశ్చర్యం.
కృష్ణా నదీ జలాలను శ్రీశైలం జలాశయం నుండి గ్రావిటీ ద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మీదుగా తెలుగు గంగ,గాలేరు-నగరి ప్రాజెక్టులకు సరఫరా చేయాలి.వాటి నిర్మాణాలను సత్వరం పూర్తి చేయాలి.2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కృష్ణ నీటిని సర్దుబాటు చేయాలంటూ ఆ ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించింది.తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది,ఈ అంశంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నేడు విచారణ కూడా చేస్తున్నది,ఈ నేపథ్యంలో మంత్రి గారి వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరం.
ఇదివరకే ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారికి రాయలసీమ ప్రాంత ప్రజాసంఘాలు,సాగునీటి రంగ నిపుణులు రాతపూర్వకంగా విజ్ఞాపన పత్రాలను సమర్పించడం జరిగింది, అయినా మేము పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న సామెతగా ప్రభుత్వం పోలవరం-బనకచర్ల భారీ ఎత్తిపోతల పథకంపై డిపిఆర్ కోసం టెండర్ పిలిచింది. నేడు ఎందుకు రద్దు చేసుకున్నదో పారదర్శకంగా జవాబుదారితనంతో చిత్తశుద్ధితో వాస్తవాలను ప్రజలకు వివరించాలి.
జాతీయ నదుల అనుసంధానంలో అంతర్భాగంగా గోదావరి,కృష్ణ, పెన్నా నదుల (పోలవరం- బొల్లాపల్లి -సోమశిల) అనుసంధాన పథకమే అమలు చేయాలనుకుంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం కింద ప్రతిపాదించిన ఆయకట్టుకు,మరియు నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణకు నీరు అందించే విధంగా వైకుంఠపురం సమీపంలో కృష్ణానదిని దాటించేలా చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామ

Comments
Post a Comment