ఉరవకొండ జనవరి 18:అనంతపురం నగరంలోని సప్తగిరి భల్లాలో ఆదివారం '8వ అనంత లఘు చిత్రోత్సవం-2026' కు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతపురం ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలో భాగంగా ‘రైతు ఇతివృత్తం’ తో రూపొందించిన లఘు చిత్రాలకు ఇచ్చే ప్రత్యేక అవార్డుల పోస్టర్‌ను జై కిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగమల్లి ఓబులేష్ ఆవిష్కరించారు. ఈ చిత్రోత్సవం జనవరి 27న ప్రారంభమై, 31వ తేదీ వరకు కొనసాగుతుంది. ప్రముఖ సినీ దర్శకులు, స్టార్ నటులు మరియు నిర్మాతల చేతుల మీదుగా విజేతలకు అవార్డుల ప్రధానం జరుగుతుంది.జనవరి 28న 'AI మొబైల్ ఫిల్మ్ మేకింగ్' పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం కూడా ఉంటుంది.
ఎంట్రీల ఆహ్వానం:
ఔత్సాహిక లఘు చిత్ర నటులు, దర్శకులు మరియు నిర్మాతలు తాము రూపొందించిన చిత్రాలను జనవరి 20వ తేదీలోపు పంపాల్సి ఉంటుంది. యూట్యూబ్ లేదా గూగుల్ డ్రైవ్ లింక్ ద్వారా పంపవచ్చు. 9676350681.
ఈ సందర్భంగా అనంతపురం ఫిల్మ్ సొసైటీ అధ్యక్షులు రషీద్ బాషా మాట్లాడుతూ, రైతుల వాస్తవ పరిస్థితులు మరియు వారి పోరాటాలను వెలుగులోకి తెచ్చే లఘు చిత్రాలను ప్రోత్సహించడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
