APNGGOs జిల్లా జాయింట్ సెక్రెటరీగా కె. హృషికేష్ ఎన్నిక

Malapati
0


 


అనంతపురం:

ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ (APNGGOs) జిల్లా జాయింట్ సెక్రెటరీగా కె. హృషికేష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు అసోసియేషన్  ఆంజనేయులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

సంఘం బలోపేతానికి, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి హృషికేష్ చురుగ్గా పనిచేస్తారనే నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఆంజనేయులు పేర్కొన్నారు. ఈ నియామకం పట్ల తోటి ఉద్యోగులు మరియు సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ హృషికేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

తన ఎన్నికకు సహకరించిన జిల్లా నాయకత్వానికి, సభ్యులకు హృషికేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఉద్యోగ సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!