సీనియర్ నాయకుని సిత్రాలుకేవి రమణ!

Malapati
0


  ఆయన 16 ఏళ్లు ముఖ్యమంత్రి,40 ఏళ్ల ఇండస్ట్రీ,ఆయనే చంద్రబాబు. పక్కరాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్పిటిసి మంచి నేరుగా ముఖ్యమంత్రి,ఎటువంటి అనుభవం లేని జూనియర్ నాయకుడు,రాయలసీమకు జీవనాడి అయిన *రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్* ప్రాజెక్టును ఆపాలని సీనియర్ ను అడిగితే,ఆయన మీద గౌరవంతో ఆపేశాడట, ఇది గౌరవమో లేక *ఓటుకు నోటు* అనుబంధమో తెలియదు కానీ సీనియర్ నాయకుడు ఆ పథకాన్ని ఆపేసాడు.ఇది నేను సాధించిన విజయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చెబితే సీనియర్ నాయకుడు నోరు మెదపడు.దీనిని బట్టి చంద్రబాబు రాయలసీమకు *మరణ శాసనం* చేసిన *రాయలసీమ ద్రోహి* అని తేటతెల్లమయింది.

       జగన్ మీద కోపంతో *గురుశిష్యులు* వైసీపీ ప్రభుత్వం 7వేల కోట్ల రూపాయలను వెచ్చించి, రోజుకు మూడు టీఎంసీల నీటిని పంపింగ్ చేసే సామర్థ్యంతో పనులు ప్రారంభించిన,రాయలసీమ ప్రాంతానికి ప్రాణాధారమైన *రాయలసీమ ఎత్తిపోతల* పథకాన్ని నిర్ధాక్షిణ్యంగా ఆపేశారు. 

      తలపై కర్ణాటక,డొక్కలో తెలంగాణ *దొంగ నీటి పోట్ల* ను కేంద్రం దగ్గర చూపించి ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతులు పొందుతుంటే సీనియర్ నాయకుడు పిడతలు వాయిస్తున్న *సిత్రాలు* చూడతరమా?

     ఇది మాత్రమే కాదు *గాలేరు-నగరి* ని *హంద్రీ-నీవా* కు *అనుసంధానం* చేసే పథకానికి వైసీపీ ప్రభుత్వం *మూడు వేల కోట్ల రూపాయలు టెండర్లు వేసి, 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది* అలాగే *పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ను 44వేల క్యూసెక్కుల నుండి 80వేల క్యూసెక్కులకు పెంచే పథకం,5వేల కోట్లు ఖర్చు పెడితే నాలుగు జిల్లాల పరిధిలో *గ్రావిటీ* పై *ఐదు లక్షల ఎకరాలకు సాగు నీరు* *ఐదు లక్షల మంది జనాభా కు త్రాగునీరు* అందించగల ఉమ్మడి ప్రకాశం జిల్లా వరప్రదాయని,సహజ సిద్ధమై,ప్రకృతి ప్రసాదించిన *వెలుగొండ* ప్రాజెక్టు పనులను కూడా మూలన పడేసి,అమరావతి భజన చేస్తున్న *అపర దేవేంద్రుడు* ఈ సీనియర్.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!