ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి..
ఉరవకొండ జనవరి 23 పట్టణంలోని స్థానిక కవిత కన్సల్టెన్సీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
భారత ప్రభుత్వం ఈ రోజును 'పరాక్రమ్ దివస్' (శౌర్య దినోత్సవం)గా నిర్వహిస్తోంది.నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్: "మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను" అనే నినాదంతో భారత జాతీయ సైన్యాన్ని (INA) బలోపేతం చేసి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు.సుభాష్ చంద్రబోస్ నిరుపమానమైన ధైర్యసాహసాలను, దేశం పట్ల ఆయనకు ఉన్న అంకితభావాన్ని గౌరవిస్తూ ప్రతి ఏటా ఆయన పుట్టినరోజును 'పరాక్రమ్ దివస్'గా జరుపుకుంటారు.
"ఒక వ్యక్తి ఒక ఆశయం కోసం మరణించవచ్చు, కానీ ఆ ఆశయం అతని మరణం తర్వాత వేలమందిలో పుడుతుంది." —అని నేతాజీ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉక్కిసుల గోపాల్, సామాజిక కార్యకర్త లెనిన్ బాబు,వార్డు సభ్యులు పాటిల్ నిరంజన్ గౌడ్, ముండాసు ఓబులేసు, మోపిడి చంద్ర, యూత్ కాంగ్రెస్ నాయకుడు పోసా రాము, సాయి సుందర్, బెస్త రామన్న,ఆటో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
