ఉరవకొండ : తెలుగు జాతి గర్వకారణం, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి వేడుకలు జరుగుతున్న వేళ ఉరవకొండ తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. పార్టీ సీనియర్ నాయకులు సన్న ప్రతాప్ ఈరోజు ఉదయం హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు.
ఈ వార్త తెలియగానే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా పట్టణ మరియు మండల పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక కవిత హోటల్ సర్కిల్ వద్ద సన్న ప్రతాప్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
