ఉరవకొండ జనవరి 10:
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని జి.ఆర్ ఫంక్షన్ హాల్లో,భూమన్ కరుణాకర్ రెడ్డి ప్రచురించిన *ఇమాం ప్రస్థానం* పుస్తక ఆవిష్కరణ మరియు *ఇమామ్ దంపతులకు ఘన సన్మానం* జరిగింది.
పుస్తకావిష్కరణను వై.విశ్వేశ్వర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే ఆవిష్కరించగా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కేవీ రమణ,జిల్లా అధ్యక్షులు జి నారాయణరెడ్డి, ఉపాధ్యక్షులు కృష్ణ,నాయకత్వంలో ఘన సన్మానం చేశారు.
ఈ సందర్భంగా నేడు కూటమి ప్రభుత్వం రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి,ఎం.వి. రమణారెడ్డి,మైసూరా రెడ్డి, గార్ల నాయకత్వంలో నిర్వహించిన *పోతిరెడ్డిపాడు పాదయాత్ర* తరహాలో *రాయలసీమ మహాసభ* ను అనంతపురంలో నిర్వహించాలని,అలాగే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం పేద ప్రజలకు అండగా నిలబడిన *ఆర్డిటికి ఎఫ్ సి ఆర్ ఏ* ను పునరుద్ధరిఝచాలని తీర్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి, మేయర్ వసీం సలీం,డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి, ఎర్రి స్వామి రెడ్డి,వైయస్సార్సీపి పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి,బుక్కచెర్ల నల్లపురెడ్డి,మాజీ రజక కార్పొరేషన్ చైర్మన్ మీసాల రంగన్న,మాజీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ యాదవ్,ఆత్మా రామిరెడ్డి, ప్రముఖ రచయితలు బండి నారాయణస్వామి,శాంతి నారాయణ, అభ్యుదయ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాదులు ఉమాపతి,సత్యనారాయణ రెడ్డి,సాంబి రెడ్డి,శాంత మూర్తి, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు,రెడ్స్ స్వచ్ఛంద సంస్థ సీఈవో భానూజ,కుల్లాయి స్వామి,ఎస్ టి ఎస్ సి జేఏసీ నాయకులు సాకే హరి,విద్యార్థి నాయకులు చంద్రశేఖర్ యాదవ్, మానవత సలీం మాలిక్, ఆలంబన జనార్ధన,ఇమామ్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని *లాంగ్ లీవ్ ఇమామ్* *వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి* *మా వాటా మాకు ఇవ్వాలి* నినాదాలు చేశారు.

