జనవరి 09:
బొమ్మనహల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఎన్నికల నిర్వహణ అధికారి గంగాధర ఆధ్వర్యంలో నూతన ఎంపీపీగా ముల్లంగి నాగమణి ప్రమాణ స్వీకారం చేశారు. అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
నాయకులకు కృతజ్ఞతలు:
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముల్లంగి నాగమణి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోడసలపల్లి హనుమంతరెడ్డి, మండల సీనియర్ నాయకులు కొత్తపల్లి తిమ్మరాజు, కొత్తపల్లి మల్లికార్జున, కొత్తపల్లి మహేంద్ర, కే.మల్లికార్జున, మండల కన్వీనర్ బలరాంరెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే అన్ని గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ముఖ్య నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
అభివృద్ధిపై హామీ:
మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులను, అధికారులను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా గ్రామాల ప్రగతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
సందడిగా ప్రమాణ స్వీకారోత్సవం:
ఈ కార్యక్రమంలో రాయదుర్గం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గోడసలపల్లి హనుమంతు రెడ్డి, మండల సీనియర్ నాయకులు కొత్తపల్లి మల్లికార్జున, కొత్తపల్లి తిమ్మరాజు, తహశీల్దార్ మునివేలు, ఎంపీడీఓ విజయభాస్కర్ మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మండల పరిధిలోని 33 గ్రామాల నుంచి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, యువకులు, అభిమాన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై నూతన ఎంపీపీ ముల్లంగి నాగమణి, నారాయణస్వామిని పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
