ఏపీ 108 అంబులెన్స్ సర్వీసెస్‌లో EMT, డ్రైవర్ల నియామకాలు

0
విజయవాడ, సెప్టెంబర్ 27: రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ 108 అంబులెన్స్ సర్వీసెస్‌లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాల ప్రకారం, EMT పోస్టులకు B.Sc Nursing, GNM, B.Sc Life Sciences, B.Sc Physiotherapy, B.Sc/M.Sc EMT అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. డ్రైవర్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ట్రాన్స్‌పోర్ట్ లైసెన్స్ (TR) మరియు కనీసం రెండేళ్ల అనుభవం తప్పనిసరి. ఈ పోస్టులకు కూడా గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 29, 30 తేదీల్లో విజయవాడలోని మంగళరావుపేటలో ఉన్న భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, PMD బ్రాంచ్ ఆఫీస్ (మెగాసిటీ ప్లాజా సమీపంలో) నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికేట్లు, అనుభవ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్స్‌తో పాటు జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచించారు. ఆరోగ్యరంగంలో సేవా భావంతో పని చేయదలచిన యువతకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!