Skip to main content

చేనేతల చూపు. ప్రత్యమ్నాయం వైపు

 నేతన్నకు నిరాధారణ



- పట్టు కోల్పోతున్న చేనేత

- జీఎస్టీ గుదిబండగా మారిన వైనం

- అమలు కానీ చేనేత1985 రిజర్వేషన్ చట్టం.

- చేనేత పై పవర్ లూమ్స్.

 ఆధిపత్యం

- పవర్ లూమ్స్ కార్మికునికి తప్పని కష్టాలు.

 - చేనేత వస్త్రాల తయారీపై 30% రాయితీ ఇవ్వాలి.

దశాబ్దాలకు పైగా ఆడిన మగ్గం నేడు మూలాన పడింది. హరివిల్లు లాంటి అందమైన పట్టు చీరను తయారుచేసే నేతన్న కష్టాల కడలిలో పడ్డాడు. వ్యవసాయం తర్వాత అత్యధికమంది జీవనం సాగిస్తున్న చేనేతపై పాలకుల చిన్నచూపు కొనసాగడంతో ఈ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది.

ఒకప్పుడు వేల మందికి ఉపాధినిచ్చిన చేనేత నేడు దాని ఉనికినే కోల్పోయే ప్రమాదంలో పడింది.

 చిన్న చూపు అధికారుల నిర్లక్ష్యం వెరసి నేతన్న వృత్తికి దూరమవుతున్నాడు.

 ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చే పార్టీల నాయకులు ఆ తర్వాత వాటిలో పది శాతం కూడా అమలు చేయడం లేదు..

 కొత్తవి అమలు చేయకపోగా పాత వాటిని రద్దు చేయడంతో కార్మికులు ప్రభుత్వ సహాయానికి దూరం అవుతున్నారు.ఉన్న కష్టాలకు తోడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం పట్టు చీరల వ్యాపారాలపై జీఎస్టీ విధించటంతో చేనేత రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉన్న కష్టాలకు జీఎస్టీ తోడు కావడంతో చేనేత మ ను గడే ప్రశ్నార్థకంగా మారింది?.


అమలు కాని చేనేత రిజర్వేషన్ చట్టం: చేనేత రంగ పరిరక్షణ కోసం 1985లో చేనేత రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 11 రకాల చేనేత వస్త్రాలను హ్యాండ్లూమ్ మినహా మిగతా దేని ద్వారా తయారు చేయకూడదనే నిబంధన చేసింది. ఒక ఎన్ఫోర్స్మెంట్ శాఖను ఏర్పాటు చేసింది. 1990 వరకు ఈ చట్టం సరిగా అమలైంది. ఆ తర్వాత ఇందులో మార్పులు చోటు చేసుకున్నాయి. 2000 సంవత్సరం వచ్చేసరికి రిజర్వేషన్ చట్టం పూర్తి అతిక్రమణకు గురైంది. చేనేత రకాలను ఇబ్బడి ముబ్బడిగా పవర్ లూమ్స్ పై తయారు చేయడం మొదలైంది. చేనేత పరిరక్షణకు సంబంధిత ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం తిరుపతిలో ఉంది. ఐదు రాష్ట్రాలకుప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. కార్మికులు ఉన్నచోట కు ఈ రెండు కార్యాలయాలుదూరంగా ఉన్నాయి.రిజర్వేషన్ చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చుట్టపు చూపుగా తనిఖీలు నిర్వహిస్తూ కాలం వెలిబుచ్చుతున్నారు. దీంతో పవర్ లూమ్స్ విక్రయాలు యదేచ్చగా కొనసాగుతున్నాయి. 1985లో రిజర్వేషన్ చట్టం అమలు కోసం పార్లమెంటులో ఒక అడ్వైజరీ కమిటీ వేశారు. అయితే ఇందులో చేనేత కార్మికులను సభ్యులుగా చేయకుండా ఈ రంగంతో సంబంధంలేని వారిని నియమించింది.. వీరు ఏ రోజు చేనేత ప్రాంతాలలో అధ్యయనం చేసిన దాఖలాలు లేవు. 

వ్యవస్థ చిన్నాభిన్నం కావటానికి ప్రధాన కారణంగా పవర్ లూమ్స్ ::పవర్లూమ్స్ కు ప్రభుత్వాలు ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతులు తెలపటంతో హ్యాండ్లూమ్ కు కోలుకొని దెబ్బ తగిలింది. చేనేత రిజర్వేషన్ చట్టప్రకారం హ్యాండ్లూమ్ లో తయారయ్యే 11 రకాలు పవర్ లూమ్స్ లో తయారు చేయకూడదనే నిబంధన ఉంది. అయితే ఈ నిబంధన ఎక్కడ అమలు కాలేదు. హ్యాండ్లూమ్ రకాలను పవర్లూమ్స్ లోనే తయారు చేస్తున్నారు. 1990లో ప్రభుత్వ0 పవర్ చట్టం చేసినప్పుడు కార్మిక సంఘాలు నాయకులు పూర్తిగా వ్యతిరేకించాయి. దీనిని అమలు చేస్తే హ్యాండ్లూమ్ వ్యవస్థ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ప్రభుత్వం వీటిని ఏమీ పట్టించుకోకుండా పవర్ లూమ్స్ కు అనుమతులు ఇచ్చేసింది. హ్యాండ్లూమ్స్ లో తయారయ్యే చీరలను పవర్ లూమ్స్ లో తయారు చేయకూడదన్న నిబంధన సైతం ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రస్తుతం ధర్మవరం రాయదుర్గం మార్కెట్లలో విచ్చలవిడిగా పవర్లూమ్ చీరలు విక్రయాలు కొనసాగుతున్నాయి. దీనిపై నిఘా ఉండాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చీరల విక్రయాలపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సి ఉంది

 -జీఎస్టీ తో అతలాకుతలం: ఉన్న కష్టాలకు తోడు చేనేత రంగంపై జీఎస్టీ దెబ్బ మరింత తీవ్ర నష్టాన్ని చేకూరుస్తోంది. యంత్రాలపై తయారయ్య వస్తువులపై ఐదు శాతం జీఎస్టీ అమలు చేసిన కేంద్రం చేతివృత్తలపై తయారయ్యే దానికి కూడా దానిని వర్తింపజేసింది. ఈ విధానంతో అమ్మకం కొనుగోలుదారులు ఇద్దరూ నష్టాన్ని చెవి చూడాల్సి వస్తోంది. వీటితోపాటు ముడి పట్టు పై ఐదు శాతం, జరీ పై 12 శాతం అద్దకం రంగుల పై 18, పట్టు వస్త్రం పై ఐదు శాతం జీఎస్టీని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. పట్టుచీర తయారీ నుంచి అమ్మకం వరకు జీఎస్టీ నష్టాలను మిగులుస్తోంది. ఇప్పటికే ఆదాయం లేక ఇబ్బందుల్లో ఉన్న కార్మికుడు జీఎస్టీ దెబ్బకు కుదేలవుతున్నారు.


-పవర్లూమ్ కార్మికులకు తప్పని కష్టాలు: పాలకులు పవర్లూమ్ కార్మికుని కైనా న్యాయం చేస్తారా అంటే అదీ లేదు. యజమానులకు లాభం చేకూర్చే పనులను చేస్తూ కార్మికుని అన్యాయానికి గురి చేస్తున్నారు. పవర్ లూమ్స్ లో కార్మిక చట్టానికి లోబడి కార్మికులతో పనులు చేయించుకోవాల్సి ఉంది. ఎనిమిది గంటలు పని విధానాన్ని అమలు చేసి గిట్టుబాటు కూలి కల్పించాలి.

 కష్టాల కడలిలో కూరుకు పోయిన నేతన్నను ఆదుకునేందుకు తక్షణమే చేనేత బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో కార్మిక సంఘాల నాయకులు సభ్యులుగా ఉంచి కార్మికుల ప్రయోజనాలు చేకూర్చే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మహాత్మా గాంధీ బోనకల్ యోజన పథకం కింద చేనేత కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలి ప్రతి కార్మికునికి హెల్త్ కార్డులు పంపిణీ చేయాలి. కార్మికునికి అంతో దయ కాళ్ళు ఇచ్చి తద్వారా 35 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వాలి. చేనేత ప్రాంతాల్లో వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలి బడి పిల్లలకు ఉచిత చేనేత వస్త్రాలు పంపిణీ చేయాలి. సహకార సంఘాలు తయారుచేసిన వస్త్రాలపై 30% రాయితీ ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికన చేనేతకు బడ్జెట్లో 1000 కోట్లు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలి.

 ఉరవకొండ లో 35 వేల పైచిలుకు చేనేత జనాభా కలిగిన పట్టణం లో చేనేత, పట్టు చీరలు తయారీలో సాటిలేని కళాకారులు ఉన్నారు సరైన ప్రోత్సాహకం లేక వారు నిరాదరణకు గురయ్యారు. వృత్తిని వదిలి వారు ప్రత్యామ్నాయం వైపు ఉరుకులు,పరుగులు తీస్తున్నారు.

దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత రెండవది ఉన్న కార్మికులను ఆయా సంఘాలు కోరుతున్నాయి...

Comments

Popular posts from this blog

విలేకరి నుంచి వీఆర్వో లంచావతారం

అవినీతి లో తగ్గేదేలే అనంతపురం జిల్లా: ఉరవకొండ తహసిల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ సేవలు పొందాలంటే కాసులు కురిపించాల్సిందేనని, కొందరు వీఆర్వోలు (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లు) చేయి తడిపితేనే ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేస్తున్నారని బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జర్నలిస్టునే లంచం డిమాండ్ చేసిన వైనం తాజాగా, ఉరవకొండలో జరిగిన ఓ ఘటన తహసిల్దార్ కార్యాలయ సిబ్బందిని, ప్రజలను షాక్‌కు గురి చేసింది. స్థానిక జర్నలిస్ట్ ఒకరు తన చిన్నాన్న పొలానికి సంబంధించిన ఓనర్‌షిప్ సర్టిఫికెట్ కోసం ఆమిద్యాల వీఆర్వోను సంప్రదించారు. అయితే, వీఆర్వో ఏకంగా ₹4,500 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. నిత్యం ప్రజా సమస్యలపై వార్తలు రాసే జర్నలిస్టునే ప్రభుత్వ కార్యాలయంలో, సహచర రెవెన్యూ ఉద్యోగుల సమక్షంలో బహిరంగంగా డబ్బు అడగడం చర్చనీయాంశమైంది. లంచం ఇస్తేనే సంతకాలు పెడతానని వీఆర్వో కరాకండిగా చెప్పడంతో, అతని అవినీతి ఆట కట్టించాలని జర్నలిస్ట్ నిర్ణయించుకున్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రయత్నం దీంతో, సదరు జర్నలిస్ట్ వీఆర్వో లంచం తీసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో మరి...

గడే కల్లులో గర్భిణీ మృతి

విడపనకల్ మండలం విడ కల్లు గ్రామానికి చెందిన బోయ సావిత్రి(25) అనే గర్భిణి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొన్ని రోజుల నుంచి ఆమె జ్వరంతో బాధపడుతున్నారు. సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటం లేదని తెలుస్తుంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు కర్నూలుకు తరలించి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బోయ సావిత్రి ఆదివారం మృతి చెందారు. దీంతో తల్లిదండ్రులు బోరున వినిపించారు. గడేకల్లులో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న నర్సులు పౌష్టికాహార విలువలు, సమతుల్య ఆహారం గురించిన వైద్య సలహాలు, జ్వర పీడితుల రక్తనమూనాలు సేకరించి తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించిన పాపాన పోలేదు. గర్భవతుల గురించిన జాగ్రత్తలు అనా రోగ్య నిర్మూలన సమస్యలు పాటించకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతమైన గడే కల్లులో గర్భిణీ సావిత్రి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యుడు ఇస్మాయిల్, నరుసు నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల బాలుడు జ్వరంతో మృతి ఘటన మరవకముందే విడపనకల్ మండలం గడే కల్లులో సావిత్రి అనే గర్భిణీ...

ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం సందర్భంగా పరిటాల శ్రీరామ్*

ధర్మవరం ట్రూ టైమ్స్ ఇండియా ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఆటో డ్రైవర్ల కష్టాల నుంచి పుట్టిందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అన్నారు. ధర్మవరంలో ఈ పథకం ప్రారంభం ఘనంగా జరిగింది. ముందుగా మార్కెట్ యార్డ్ వద్ద నుంచి టిడిపి, బిజెపి, జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మధుసూదన్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు,బిజెపి నాయకులు హరీష్, బిజెపి సత్యసాయి జిల్లా అధ్యక్షులుశేఖర్ తో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రవాణాశాఖ అధికారులు,ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లకు ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించిన మెగా చెక్కును అందజేశారు. మొత్తం నియోజకవర్గంలో 1130 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.1.69కోట్లు జ‌మ చేశారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లినప్పుడు వారి కష్టాలు చూసి సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారన్నారు. అలాగే ఇప్పుడు అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాలు ప్రజల నుంచి వచ్చాయన్నా...