13,217 గ్రామీణ బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్!

0
హైదరాబాద్:ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకిం గ్,పర్సనల్ సెలక్షన్ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 పోస్టు ల భర్తీకి దరఖాస్తు గడువు ఈనెల 21 తో ముగిసింది, అభ్యర్థుల కోరిక మేరకు ఐబీపీఎస్‌ ఈ నెల 28 వరకు పొడిగించింది. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా ఎంపిక ఉంటుంది. ఏపీ గ్రామీణ బ్యాంక్‌లో 152, తెలంగాణ గ్రామీణ్‌ బ్యాంక్‌లో 798 పోస్టులు ఉన్నాయి. ఐబీపీఎస్‌ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీసర్స్‌ (స్కేల్‌ 1, 2,3) ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏదైనా డిగ్రీ కొన్ని పోస్టులకు స్పెషలైజ్డ్‌ డిగ్రీ అవసరం ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి సెప్టెంబర్‌ 1 నాటికి ఆఫీస్‌ అసిస్టెంట్లకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 1 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 2 పోస్టులకు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 3 పోస్టులకు 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరి మితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి రూ.175, మిగతా వారికి రూ.850. ప్రాథమిక పరీక్షలు నవంబర్‌ లేదా డిసెంబర్‌లో, ప్రధాన పరీక్షలు డిసెంబర్‌లో లేదా ఫిబ్రవరి 2026లో నిర్వహించబడతాయి. ఆఫీసర్స్‌ పోస్టుల ఇంట ర్వ్యూలు జనవరి - ఫిబ్రవరి 2026లో జరుగుతాయి. తుది ఫలితాలు, ప్రొవిజిన ల్‌ అలాట్‌మెంట్‌ ఫిబ్రవరి లేదా మార్చి 2026లో ప్రకటించబడతాయి. పూర్తి వివరాలకు www.ibps.in ను విజిట్‌ చేయండి. #truthnewschannel #Telangana

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!