చెక్కును అందజేసిన జిల్లా కలెక్టర్
నంద్యాల, సెప్టెంబరు 26:
అనంతపురం జిల్లాలో నవంబర్ 7, 8, 9 తేదీలలో జరగనున్న 7వ రాష్ట్ర రెవెన్యూ క్రీడా సాంస్కృతికోత్సవాలలో పాల్గొనబోయే నంద్యాల జిల్లా రెవెన్యూ ఉద్యోగుల కోసం జిల్లా కలెక్టర్ రూ.1,50,000/- ల చెక్కును ఏపిఆర్ఎస్ఏ నంద్యాల జిల్లా కార్యవర్గానికి అందజేశారు.
*రెవెన్యూ సిబ్బంది క్రీడలకు అవసరమైన మెటీరియల్, స్పోర్ట్స్ కిట్స్ కొనుగోలు మరియు ఇతర ఏర్పాట్ల కోసం ఈ ఆర్థిక సహాయం అందజేయడం పట్ల జిల్లా రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయక్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుభాకర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, ముఖ్యంగా అశక్తి కలిగిన సిబ్బంది తమ వివరాలను నమోదు చేసుకుని ఈ క్రీడల్లో పాల్గొనడానికి సమాయత్తం కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపిఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షులు కామేశ్వర రెడ్డి, ఏపిజేఏసీ జిల్లా చైర్మన్ & ఏపిఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి రామచంద్ర రావు, ఏపిఆర్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి శూలం విజయ శేఖర్, జిల్లా సహాధ్యక్షులు పత్తి సత్య శ్రీనివాసులు, జిల్లా కోశాధికారి నాగరాజు, కలెక్టరేట్ యూనిట్ కార్యదర్శి రామాసంజీవ రావు, గౌరవ సలహాదారు రవీంద్ర ప్రసాద్ తదితర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment