శింగనమల నియోజకవర్గ పరిధిలోని మిడ్ పెన్నారు ఆధునికీకరణ, జల్ జీవన్ మెషీన్ ని పునరుద్ధరించి నీటి ప్రాజెక్టులకు, నియోజకవర్గంలో ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ని కలిసి, వినతిపత్రం అందజేయడం జరిగింది.
అలాగే నియోజకవర్గ పరిధిలోని యల్లనూరు, పుట్లూరు మండలాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉంది. గండికోట - పుట్లూరు - సుబ్బరాయ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, జల్ జీవన్ మెషీన్ కింద పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ, నిధులు విడుదల చేస్తే నీటి సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి వివరించాను. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరగా.. చంద్రబాబు గారు సమస్యలు పై సానుకూలంగా స్పందించారు.

Comments
Post a Comment