విజయవాడ దుర్గగుడి ధర్మకర్తల మండలిలో 16 మంది కొత్త సభ్యుల నియామకం
September 26, 2025
0
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం (దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం) ధర్మకర్తల మండలి పునర్‌వ్యవస్థీకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 16 మందిని సభ్యులుగా ఎంపిక చేస్తూ జాబితాను ఖరారు చేసింది. ఇందులో తెలుగు దేశం పార్టీకి అత్యధికంగా 11 స్థానాలు, జనసేన పార్టీకి మూడు, భారతీయ జనతా పార్టీకి రెండు స్థానాలు కేటాయించబడ్డాయి. అదనంగా ప్రత్యేక ఆహ్వానితులుగా విజయవాడకు చెందిన మార్తి రమాబ్రహ్మం, ఏలేశ్వరపు సుబ్రహ్మణ్యకుమార్లను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన జీవో అధికారికంగా త్వరలో విడుదల కానుంది.
ఇప్పటికే పోరంకి ప్రాంతానికి చెందిన బొర్రా రాధాకృష్ణను ఆలయ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రకటించిన జాబితాతో ధర్మకర్తల మండలి పూర్తయింది. ఈ నియామకాలు ఆలయ పరిపాలన, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పనులపై ప్రభావం చూపనున్నాయి.
మండలి సభ్యుల జాబితా:
విజయవాడ వెస్ట్ నుంచి అవ్వారు శ్రీనివాసరావు (బీజేపీ), విజయవాడ సెంట్రల్ నుంచి బడేటి ధర్మారావు (టీడీపీ), మైలవరం నుంచి గూడపాటి వెంటక సరోజినీ దేవి (టీడీపీ), రేపల్లె నుంచి జీవీ నాగేశ్వర్ రావు (టీడీపీ), హైదరాబాద్‌కు చెందిన హరికృష్ణ (టీడీపీ తెలంగాణ), తాడిపత్రి నుంచి జింకా లక్ష్మీ దేవి (టీడీపీ), నందిగామ నుంచి మన్నె కళావతి (టీడీపీ), దెందులూరు నుంచి మోరు శ్రావణి (టీడీపీ), విజయవాడ వెస్ట్ నుంచి పద్మావతి ఠాకూర్ (జనసేన), నెల్లూరు రూరల్ నుంచి పనబాక భూ లక్ష్మి (టీడీపీ), విజయవాడ సెంట్రల్ నుంచి పెనుమత్స రాఘవ రాజు (బీజేపీ), పెనమలూరు నుంచి వెలగపూడి శంకర్ బాబు (టీడీపీ), విజయవాడ వెస్ట్ నుంచి సుకాశి సరిత (టీడీపీ), నందిగామ నుంచి తంబాళపల్లి రమాదేవి (జనసేన), తెనాలి నుంచి తోటకూర వెంటక రమణా రావు (జనసేన), పెనమలూరు నుంచి అన్నవరపు వెంటక శివ పార్వతి (టీడీపీ) ఎంపికయ్యారు.
