ఎస్టిఐ రమణమ్మా.. నీ ఈ సడింపు చర్యలు మానమ్మా!

Malapati
0


 ​.కొందరికి మోదం.. అందరికీ ఖేదం.

-​ఉరవకొండ డిపో ఉద్యోగుల సమస్యలపై 

 డిపో మేనేజర్, ఎస్ టి ఐ చర్యలతో సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఒకరివి ఒంటెత్తు పోకడలైతే, మరొకరి విసడింపు చర్యలతో మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. డిపో మేనేజర్ చర్యలు అందరి ప్రయోజనాలకు కాకుండా కొందరికి మాత్రమే మేలు చేకూరేలా ఉందనే విమర్శలు వెళ్ళుతున్నాయి. ఇది ఇలా ఉంటే రమణమ్మ పరిస్థితి నేటి యొక్క ఒకనాటి కోడలు అన్న చందంగా మారింది. కండక్టర్ స్థాయి నుంచి ఎస్ టి ఐ స్థాయికి ఎదిగిన ఆమె సిబ్బంది పట్ల బూతులు వల్లించడం ఉద్యోగస్తులకు మింగుడు పడటం లేదు. ఆమెన్ పై అనేక అవినీతి ఆరోపణలు రాత మూలకంగా ఫిర్యాదు చేసిన అవి బుట్ట దాఖలు కావటం హాట్ టాపిక్ గా మారింది. మేం ఇంతే మారం అంతే అన్న చందంగా ఇరువురి పరిస్థితులతో సిబ్బంది తలబాదుకుంటున్నారు.

​ఉరవకొండ డిపోలో ఉద్యోగులు గత కొంతకాలంగా రెండు ప్రధాన సమస్యల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించమని పలుమార్లు డిపో మేనేజర్‌ను కోరినా ఎటువంటి స్పందన లేకపోవడంతో కార్మిక పరిషత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టాలని నిర్ణయించారు.

​1. డిజిటల్ ఛార్టు జారీలో జాప్యం

​డిపోలో చివరిసారిగా డిజిటల్ ఛార్టును 06.12.2023న వేశారు. హెడ్ ఆఫీస్ ఆదేశాల ప్రకారం ప్రతి సంవత్సరం కొత్త డిజిటల్ ఛార్టు వేయాల్సి ఉన్నప్పటికీ, దాదాపు రెండు సంవత్సరాలు గడిచినా కొత్త ఛార్టు వేయలేదు.

​గత ఆరు నెలలుగా ఉద్యోగులు డిపో మేనేజర్ ను ఈ విషయంపై కోరుతూ మూడు సార్లు మెమొరాండం కూడా సమర్పించారు. అయినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

​కొందరు ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడానికి మాత్రమే మేనేజర్ ఈ విషయంలో జాప్యం చేస్తున్నారని ఉద్యోగులు బహిరంగంగా చర్చించుకుంటున్నారు.

​2. ఎస్.టి.ఐ. రమణమ్మ వేధింపులు:

​డిపోలో ఎస్.టి.ఐ. రమణమ్మ వేధింపులు హద్దు మీరిపోయాయి. ఆమె ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు తిడుతూ, నోటికి వచ్చిన బూతులు మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నారు.

​సెలవులు కోరినా లేదా ఏదైనా విషయం గురించి అడిగినా ఆమె ఉద్యోగులపై అరుస్తున్నారు. తన కింద పనిచేసే ఎ.డి.సి. (ADC), డి.సి. (DC) లను కూడా అసభ్యంగా తిడుతున్నారని, దీనిపై పై అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఎటువంటి మార్పు రాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

​ఎస్.టి.ఐ. రమణమ్మ ఉద్యోగులను బానిసలుగా చూస్తున్నారని, తాను యజమాని అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉద్యోగులను అవమానిస్తున్నారని ఉద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

​డిమాండ్ మరియు నిరసన:

​ఈ రెండు ప్రధాన సమస్యలను డిపో మేనేజర్ పరిష్కరించడంలో విఫలమవడంతో, కార్మిక పరిషత్ అసోసియేషన్ ఉద్యోగులు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహిస్తూ తమ నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. ఉద్యోగుల ఆందోళన, భయాన్ని దృష్టిలో ఉంచుకుని పై అధికారులు తక్షణమే ఈ సమస్యలపై జోక్యం చేసుకుని పరిష్కార చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యోగుల తరపున నిరసన కొనసాగుతుందని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!