తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు
తిరుమల: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ భక్తుల సౌకర్యార్థం విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేసింది.
భక్తులకు ప్రత్యేక వంటకాలు, దర్శన ఏర్పాట్లు
- ఈసారి భక్తులకు 16 రకాల వంటకాలు పంపిణీ చేయనుంది.
- మాడవీధుల్లో వేచి ఉండే భక్తులకు 45 నిమిషాల వ్యవధిలో 35 వేల మందికి దర్శనం కల్పించేలా రీఫిల్లింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది.
- మాడ వీధుల బయట ఉన్న భక్తుల కోసం 36 ఎస్ఈడీ స్క్రీన్లు అమర్చారు.
- సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు.
పుష్పాలు, సాంస్కృతిక ప్రదర్శనలు
- తొమ్మిది రోజుల ఉత్సవాల్లో రూ.3.5 కోట్ల విలువైన 60 టన్నుల పుష్పాలు వినియోగించనున్నారు.
- 229 కళాబృందాలు (29 రాష్ట్రాల నుంచి) సాంస్కృతిక ప్రదర్శనల్లో పాల్గొంటాయి.
- 3,500 మంది శ్రీవారి సేవకులు అందుబాటులో ఉంటారు.
రవాణా, భద్రతా ఏర్పాట్లు
- కొండపై ప్రతి 4 నిమిషాలకోసారి టీటీడీ, ప్రభుత్వ బస్సుల ద్వారా యాత్రికులను తరలిస్తారు.
- నిఘా కోసం 3,000 సీసీ కెమెరాలు అమర్చారు.
- 2,000 మంది టీటీడీ సెక్యూరిటీ, 4,700 మంది పోలీసులు, 450 మంది సీనియర్ అధికారులు భద్రతను పర్యవేక్షిస్తారు.
అన్నప్రసాదం, లడ్డూలు
- వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తారు.
- రోజూ 8 లక్షల లడ్డూలు భక్తుల కోసం అందుబాటులో ఉంచనున్నారు.
సమాచార కేంద్రాలు, పారిశుద్ధ్యం
- ప్రతి 100 మీటర్లకోసారి సమాచార కేంద్రం — మొత్తం 20 ఏర్పాటు చేశారు.
- పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక యాప్ ప్రవేశపెట్టారు. అధికారుల పనితీరు, భక్తుల ఫీడ్‌బ్యాక్ దీనిలో పర్యవేక్షించబడుతుంది.
చెప్పుల సమస్య పరిష్కారం
- రోజూ దాదాపు 20 వేల చెప్పులు ఎక్కడపడితే అక్కడ వదిలిపెట్టే సమస్యను నివారించేందుకు QR కోడ్ సిస్టమ్ ప్రవేశపెట్టారు.
- భక్తులు అప్పగించిన చెప్పులను QR స్లిప్ ద్వారా తిరిగి పొందవచ్చు. ఈ విధానం వల్ల 90% సమస్య పరిష్కారమైంది.
పార్కింగ్ సొల్యూషన్స్
భవిష్యత్తులో పార్కింగ్ సమస్యలను అధిగమించడానికి ఆస్ట్రేలియాలో విజయవంతమైన స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్ను బ్రహ్మోత్సవాల అనంతరం అమలు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

Comments
Post a Comment