మొబైల్ పాస్ పోర్టు వాహనం అందుబాటులోకి
September 22, 2025
0
పాస్ పోర్టు కోసం ఇకపై ప్రాంతీయ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి నిరీక్షణకు తెరపడనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం మొబైల్ పాస్ పోర్టు వాహనాన్ని ప్రారంభించింది.
🔹 పాస్ పోర్టు సేవా పోర్టల్‌లో వాహనం ఎప్పుడు, ఎక్కడకు వస్తుందో సమాచారం అందుబాటులో ఉంటుంది.
🔹 దాన్ని బట్టి ఆన్లైన్‌లో ఫారం నింపి, రుసుము చెల్లించి, వాహనం వచ్చినప్పుడు నేరుగా వెళ్లొచ్చు.
🔹 ఈ వాహనంలో నలుగురు సిబ్బంది ఉంటారు. రోజుకు 40 మందికి సంబంధించిన ధ్రువపత్రాలు పరిశీలించి, బయోమెట్రిక్, ఫొటో తీసి పాస్ పోర్టు నమోదు చేస్తారు.
🔹 పరిశీలన పూర్తయిన తర్వాత పాస్ పోర్టు తపాలా ద్వారా ఇంటికే వస్తుంది.
గుంటూరు జిల్లా మంగళగిరి వి.టి.జె.ఎం & ఐ.వి.టి.ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఈ మొబైల్ పాస్ పోర్టు వాహనాన్ని అందుబాటులో ఉంచారు. రెండు రోజుల పాటు ఇక్కడ సేవలు అందిస్తారు.
Tags
