రైతులకు 90 శాతం సబ్సిడీతో పప్పు శనగను పంపిణీ చే
యాలి
రబీ సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా నియోజకవర్గంలో రైతులందరికీ 90 శాతం సబ్సిడీతో పప్పు సెనగ, పెసర, అలసందులు విత్తనాలు మరియు ఎరువులు, పురుగుల మందులను అందించాలని సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు బి. చెన్నారాయుడు ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సకాలంలో వర్షాలు వస్తున్నందున రైతులందరూ కూడా రబీ సీజన్లో విత్తన సాగకు సిద్ధమవుతున్నారని ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు సబ్సిడీ విత్తనాలు సరఫరా పై ఏలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని
ఏమాత్రం జాప్యం చేయకుండా విత్తనాలను సరఫరా చేయాలన్నారు. అలాగే ఉరవకొండ నియోజకవర్గంలో నకిలీ విత్తనాలను, పురుగుమందులను విక్రయిస్తున్న షాపు యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు.

Comments
Post a Comment