అంగన్వాడీలో గర్భవతులకు సీమంతం పండుగలు
ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల ఆధ్వర్యంలో గర్భవతులకు సీమంతం పండుగలు నిర్వహిస్తుందని ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి పేర్కొన్నారు. మండల పరిధిలోని రేణుమాకులపల్లి గ్రామంలోని గురువారం అంగన్వాడి సెంటర్ లో సంపూర్ణ పోషణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి మాట్లాడుతూ గర్భవతులతో పాటు పుట్టబోయే చిన్నారులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.గర్భవతి అయిన మొదటి నెల నుంచి ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలతో పాటు సలహాలు అనుసరించి అంగన్వాడి సెంటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే సంపూర్ణ ఆరోగ్య ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు. ఆకుకూరలు,కూరగాయలు,పిండి పదార్థాలు క్రమం తప్పకుండా భుజించాలన్నారు

.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు నాగలక్ష్మి, చాముండేశ్వరి,హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment