ఉరవకొండ : విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హౌసింగ్ బోర్డ్ బీసీ బాలికల హాస్టల్ వాడను తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
అనంతపురం లో ఉన్నటువంటి మహాత్మ పూలే విగ్రహం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు..
ఐసా జాతీయ కార్యవర్గ సభ్యులు వేమన, ఏ ఐ డి ఎఫ్ ఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి సిద్ధు పిడిఎస్యు నగర అధ్యక్షుడు శంకర్
మాట్లాడుతూ శుక్రవారం రోజున అనంతపురం నగరంలో హౌసింగ్ బోర్డ్ లో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఒక విద్యార్థిని ఆ హాస్టల్ వార్డెన్ వేధింపులకు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది కానీ అధికారులు మాత్రం విద్యార్థిని తప్పు చేసిందంటూ సమాధానం ఇస్తూ నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు ఏది ఏమైనా ఒక విద్యార్థిని హాస్టల్ వార్డెన్ ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటే కనీసం ఆ విద్యార్థిని పరామర్శించే సమయాన్ని కూడా జిల్లా అధికారులు ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం
ఈ పరిస్థితుల్లో హౌసింగ్ బోర్డ్ బీసీ కులాలు బాలికల హాస్టల్ వార్డెన్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలి. పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని మేము గట్టిగా కోరుతున్నాము. లేనిపక్షంలో విద్యార్థినిని తల్లిదండ్రులకు కలుపుకొని పెద్దగతన ఉద్యమానికి శ్రీకారం పెడతామని విద్యార్థి సంఘానిక తెలియజేశారు.

Comments
Post a Comment