కదిరిలో ఆర్.సి.పి.ఐ. ఆధ్వర్యంలో ధర్నా: ఎర్రకోట కాలనీలో మౌలిక వసతుల కల్పనకై డిమాండ్‌

Malapati
0

 కదిరి:



కదిరి: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆర్.సి.పి.ఐ. (RCPI) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సీనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నాగన్న మాట్లాడుతూ... 2023 సంవత్సరంలో RCPI ఆధ్వర్యంలో 1778-1 లేఖ ద్వారా నిరుపేదలు గుడిసెలు నిర్మించుకున్నారని తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా, ప్రభుత్వ అధికారులు వారికి మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

"రాత్రిపూట కరెంటు లేకపోవడం వల్ల విషపూరితమైన సర్పాలు, పురుగుల బెడదతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది అక్కడ నివసిస్తున్నారు," అని నాగన్న ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు ఇకనైనా 'మోద్దు నిద్ర' మానేసి, 34వ వార్డుకు సంబంధించిన ఎర్రకోట కాలనీలో నివసిస్తున్న నిరుపేదలందరికీ తక్షణమే త్రాగునీరు, విద్యుత్తు, వీధిలైట్లు, సిమెంట్ రోడ్లు వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్.సి.పి.ఐ. కదిరి నియోజకవర్గ కార్యదర్శి గుజ్జల శేఖర్, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సుగుణమ్మ, స్వప్న, విద్యార్థి సంఘం నాయకులు అరుణ్ కుమార్ తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.



Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!