ధర్మవరం నియోజకవర్గ లబ్ధిదారులకు ₹67 లక్షల సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్.
రూ.6.31 కోట్లు ఆరోగ్య సహాయం – మంత్రి సత్యకుమార్
ధర్మవరం, ట్రూ టైమ్స్ ఇండియా సెప్టెంబర్ 29: — ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్య కుమార్ యాదవ్ సోమవారం ధర్మవరం పట్టణంలోని ఎన్డీఏ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..... ధర్మవరం నియోజకవర్గానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు రూ.67 లక్షల విలువ గల చెక్కులు పంపిణీ చేశామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చూపుతున్న కట్టుబాటును గుర్తు చేస్తూ, పేదలు మరియు మధ్య తరగతి ప్రజలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు వారిపై భారంగా మారుతున్న వైద్య ఖర్చులు ప్రభుత్వ దృష్టికి వస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) మరియు ఎల్ఓసిల ద్వారా ₹5.63 కోట్లు లబ్ధిదారులకు అందించామని, ఇవాళ్టి పంపిణీ అయిన ₹67 లక్షలతో కలిపి మొత్తం ₹6.31 కోట్లు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని వెల్లడించారు.
ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, కూటమి ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రతి అడుగూ వేస్తోందని మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో సంబంధం ఉన్న ఆరోగ్యరంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు సమర్థవంతంగా, సానుకూల ఫలితాలను ఇచ్చే విధంగా వినియోగిస్తున్నామని, ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడం తన కర్తవ్యం అని స్పష్టం చేశారు.

Comments
Post a Comment