విద్యార్థుల మధ్య తారతమ్యం సృష్టించడం సరైనది కాదు. ఇది వివక్షతకు దారితీస్తోంది*
ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులను ఉల్లంఘించి పాఠశాలలను నడుపుతున్న ప్రైవేట్ పాఠశాలలు, విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఈరోజు కణేకల్ మండలం పత్రిక సమావేశం లో ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ మాట్లాడుతూ.* దసరా సెలవులు ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలు, కళాశాలలు నడుపుతున్న ప్రైవేట్,కార్పొరేట్ యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసి సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అయితే, కణేకల్, రాయదుర్గం, కేంద్రంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను లెక్క చేయకుండా విద్యార్థులను బలవంతంగా పాఠశాలలకు రప్పిస్తూ తరగతులు నిర్వహిస్తున్నాయన్నారు. మండల విద్యాశాఖాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై వారు మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెలవులు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు తరగతులు నిర్వహించడంపై ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రుల మధ్య తారతమ్య భేదాలు సృష్టించబడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు చదవని వారిగా, ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులు బాగా కష్టపడి చదివేవారిగా బేధాభిప్రాయాలు వెల్లివెత్తుతాయని అన్నారు. ప్రభుత్వ విద్యార్థులు, ప్రైవేట్ విద్యార్థుల మధ్య వెలకట్టలేని తారతమ్యం సృష్టించబడుతోందన్నారు. ఇది రాను రాను విద్యార్థుల మధ్య వివక్షతకు దారితీసే అవకాశం ఉందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థుల మధ్య తారతమ్యం సృష్టించకుండా ఏ పాఠశాలలో చదువుతున్నప్పటికీ విద్యార్థులందరికీ ఒకే విధమైన విధి విధానాలు, అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు సమానంగా అమలయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల ప్రసాద్ కణేకల్ మండలం కార్యదర్శి బాబా పకృద్దీన్, నాయకులు శ్రీకాంత్, గంగిరెడ్డి, సురేష్, చిన్న, రంజిత్, అనిల్, ఆర్ సురేష్, చరణ్ తదితరులు పాల్గొన్నరు,

Comments
Post a Comment