యువత, విద్యార్థినులు, మహిళలు భద్రతపై హెచ్చరిక
September 23, 2025
0
అమరావతి:ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థినులు, యువతులు మరియు మహిళలు చదువులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కోసం ఉన్న ఊరుకు దూరంగా ఉండాల్సి వస్తోంది. కొందరు దుర్వినియోగం చేసుకొని ఆకతాయిల వేధింపులకు గురి చేయడం వాస్తవం. ఈ పరిస్థితి భద్రతపరమైన ఒక పెద్ద సమస్యగా మారింది.
అత్యవసర పరిస్థితుల్లో బాధితులు తక్షణమే ఫిర్యాదు చేయడం అత్యవసరం. గృహహింస, వరకట్నం బాధితులు 181, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులపై 1091, చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, వేధింపులు 1089 నంబర్లను సంప్రదించాలి. ఈ ఫిర్యాదులు అధికారిక యంత్రాంగం ద్వారా వెంటనే చర్యలకు కారణమవుతాయి.
భద్రతపరంగా జాగ్రత్తలు పాటించడం అత్యంత ముఖ్యమే. సొంత భద్రత కోసం ఆన్‌లైన్, ఫోన్ లేదా సమీప పోలీస్ స్టేషన్ ద్వారా ఫిర్యాదు చేయడం మానవ హక్కుల రక్షణకు కీలకం. ప్రతి బాధితుడు లేదా సాక్షి తన ఫిర్యాదు ద్వారా ఇతరులను కూడా రక్షించడంలో సహకరిస్తాడు.
అందుకే, యువత, విద్యార్థినులు, మహిళలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, అనుమానాస్పద పరిస్థితులను నివారించాలి. పై నంబర్లను తెలుసుకొని అత్యవసర సందర్భంలో వెంటనే ఫోన్ చేయడం ద్వారా న్యాయం పొందవచ్చు.
Tags
