హిల్సా చేపల కోసం మత్స్యకారులకు సరికొత్త గైడ్: సముద్రంలో ఎక్కడ, ఎప్పుడు వేటకు వెళ్ళాలి?
September 23, 2025
0
పశ్చిమ బెంగాల్:మత్స్యకారులకు ఒక ప్రధాన సమస్య – సముద్రంలో ఎప్పుడూ ఎక్కువ చేపలు దొరుకుతాయో ముందే తెలుసుకోవడం. భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం (ఇన్కాయిస్) ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఇచ్చింది. హిల్సా చేపల లభ్యత గుట్టును ఛేదించడం ద్వారా లక్షలమందికి వేట సులభం అయ్యింది.
పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లోని హిల్సా చేపల లభ్యతను గుర్తించేందుకు ఇన్కాయిస్ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. కేంద్రం డైరెక్టర్ టి.ఎం. బాలకృష్ణన్ నాయర్ నేతృత్వంలో హైదరాబాద్‌కు చెందిన శాస్త్రవేత్తలు మరింత సులభంగా హిల్సా చేపల లభ్యతను 70-72% కచ్చితత్వంతో గుర్తించే మోడల్ను అభివృద్ధి చేశారు. ఇందులో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, లవణీయత, తరంగాల వేగం వంటి డేటాను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ తో అనుసంధానం చేశారు. దీనిపై మూడేళ్లపాటు ప్రయోగాలు జరుగాయి.
తాజాగా, ఫిషరీస్ ఓషనోగ్రఫీ జర్నల్‌లో హిల్సా చేపలను గుర్తించే పరిశోధన పత్రం ప్రచురించబడింది. ఇన్కాయిస్ ఏపీ, ఒడిశా తీర ప్రాంతాల్లోనూ హిల్సా చేపల లభ్యతను గుర్తించింది. హిల్సా చేప 14–18 మీటర్ల లోతులో వేగంగా ఈదిస్తూ రోజుకు 70 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు వీటి వేట ఎక్కువగా జరుగుతుంది.
భారతదేశంలో లభించే హిల్సాల 90% పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నది బంగాళాఖాతంలో కలిసే ప్రాంతంలోనే ఉంటాయి. ధర కిలో రూ. 1,800–2,000 వరకు ఉంటుంది. ప్రత్యేకంగా దసరా మరియు పూజా సందర్భాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో హిల్సా చేపను నైవేద్యంగా సమర్పించడం కూడా జరుగుతుంది.
Tags
