శాసనమండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను తెలుగుదేశం పార్టీ ఆదుకున్నదని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు, నారా భువనేశ్వరి గారి నేతృత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి. A
ఈ పాఠశాలల ద్వారా ఫ్యాక్షన్ రాజకీయాల్లో తమ తండ్రిని కోల్పోయిన వందలాది మంది పిల్లలకు 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు కార్పొరేట్ స్థాయి విద్యను పూర్తిగా ఉచితంగా అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విద్యతో పాటు, ఆ పిల్లల మానసిక స్థితి మెరుగుపరచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఆయన తెలిపారు.
ఈ విధంగా, ఆ విద్యార్థులు ఇప్పడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో, ప్రభుత్వ సేవల్లో స్థిరపడినారని ఆయన వెల్లడించారు. "ఇది మా తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ హత్యలతో నష్టపోయిన వారికిచ్చిన మద్దతుకు నిలువెత్తు నిదర్శనం," అని పయ్యావుల కేశవ్ గారు పేర్కొన్నారు.

Comments
Post a Comment