అమరావతి: శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం సభాపతి అయ్యన్నపాత్రుడి కార్యాలయానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. సభాపతికి తాను వెళ్లి నమస్కరించడం మర్యాదేనని సీఎం స్పష్టంచేయడం విశేషం.
శాసనసభ ప్రాంగణంలో ఇటీవల తీసుకున్న సభ్యుల గ్రూప్ ఫొటోను సీఎం ఛాంబర్‌కి అందజేయాలని మొదట సభాపతి సిబ్బందికి వర్తమానం పంపించారు. అయితే విషయం తెలిసిన సీఎం, స్పీకర్ వద్దకే స్వయంగా వెళ్లి ఫొటో అందుకున్నారు.
ఈ సందర్భంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కూడా అక్కడే ఉండగా, ఇటీవల తిరుపతిలో జరిగిన చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సు విజయవంతం కావడంపై వారిద్దరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సదస్సులో పాల్గొనాలని తాను భావించినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హాజరుకాలేకపోయానని, దీనికి విచారం వ్యక్తం చేసినట్లు సీఎం చెప్పారు.
భాపతి అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కలిసి ముఖ్యమంత్రికి శాసనసభ్యుల గ్రూప్ ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.

Comments
Post a Comment