కర్నూలు, సెప్టెంబర్ 28,
రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే సుదీర్ఘ డిమాండ్ మరోసారి చర్చనీయాంశమైంది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని విధాన మండలిలో హామీ ఇవ్వడం ఈ అంశానికి తాజా ఊపునిచ్చిందని హై కోర్ట్ సాధన సమితి నేత, సీనియర్ న్యాయ వాది జీ వి కృష్ణ మూర్తి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడు తో ఈ ప్రకటన తో
రాయలసీమ ప్రజల్లో, న్యాయవాదుల్లో మళ్లీ ఆశలు చిగురింపజేసింది.
సుదీర్ఘ పోరాటం, తాజా హామీ
2019 నుండి వివిధ ప్రభుత్వాలు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తీర్మానాలు చేసినా, న్యాయ రాజధానిగా ప్రకటనలు చేసినా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చలేదు. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈ నెల 27, 2025 శనివారం నాడు ఆంధ్ర విధాన మండలిలో హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తామని, ఈ విషయంలో మాట తప్పమని స్పష్టం చేసింది. ఈ హామీ కర్నూలు హైకోర్టు సాధన సమితి లాయర్ల ఆందోళన నేపథ్యంలో రావడం గమనార్హం.
సాధన సమితి నిరసన ముగింపు
కర్నూలు హైకోర్టు సాధన సమితి లాయర్లు ఈ నెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆందోళనలు నిర్వహించారు. ముఖ్యంగా సెప్టెంబర్ 21, 2025 నుండి సెప్టెంబర్ 27, 2025 వరకు నగరంలోని శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ధర్నా చౌక్‌లో నిరసన రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. శనివారం, సెప్టెంబర్ 27, 2025న ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ దీక్షలు ముగిశాయి.
సాధన సమితి ఈ ఆందోళనల్లో పాల్గొన్న కర్నూలు, అనంతపురం జిల్లా లాయర్లకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలియజేసింది.
భవిష్యత్ కార్యాచరణకు రౌండ్ టేబుల్ సమావేశం
ప్రభుత్వం హామీ ఇచ్చినా, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సాధన సమితి తన పోరాటాన్ని కొనసాగించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించేందుకు అక్టోబర్ 11, 2025న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ తప్పక హాజరు కావాలని సాధన సమితి సభ్యులు పిలుపునిచ్చారు.
హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటులో జాప్యంపై ప్రశ్నలు
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్‌లు విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బెంచ్ ఏర్పాటు విషయంలో జాప్యం జరగడంపై రాయలసీమ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే నాగ్‌పూర్, ఔరంగాబాద్, గోవాలో బెంచ్‌లు ఉండగా, పోయిన నెల, ఆగస్టు 18, 2025న నాలుగో బెంచ్‌ను కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేస్తున్నా, కేంద్రం అనుమతితో పాటు ప్రధానంగా సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఫుల్ కోర్టు అభిప్రాయం కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు తప్పనిసరి. హైకోర్టు బెంచ్‌ల ఏర్పాటు విషయంలో ఈ న్యాయపరమైన ప్రక్రియల కారణంగానే ఆలస్యం జరుగుతోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, రాయలసీమ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో జరుగుతున్న జాప్యాన్ని కొందరు ప్రజలు "అర్థం కాని మిలియన్ డాలర్ల ప్రశ్న"హై కోర్టు సాధన సమితి నేత సీనియర్ న్యాయ వాది జీ వి కృష్ణ మూర్తి అభివర్ణించారు.

Comments
Post a Comment