స్వయం సమృద్ధి ద్వారానే ‘వికసిత్ భారత్’ సాధ్యం: ప్రధాని మోదీ.

0


న్యూఢిల్లీ: దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో నడవకపోతే ‘వికసిత్ భారత్’ లక్ష్యం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆదివారం ప్రసారమైన ‘మన్ కీ బాత్’ 126వ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వదేశీ ఉత్పత్తుల వినియోగానికే ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.గాంధీ జయంతి సందర్భంగా ఖాదీ కొనాలి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేసి ధరించాలని ప్రధాని సూచించారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో మహాత్మా గాంధీ స్వదేశీ ఉత్పత్తులపై ప్రజల్లో అపారమైన అవగాహన కల్పించారని గుర్తుచేశారు. కాలక్రమేణా ఖాదీకి డిమాండ్ తగ్గినా, గత 11 ఏళ్లలో మళ్లీ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మోదీ వివరించారు.ప్రపంచ ఆర్థిక అనిశ్చితిలో స్వదేశీకి ప్రాధాన్యం ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను ఎదుర్కొంటున్న తరుణంలో భారతదేశం కూడా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. ఇందుకోసం స్వదేశీ ఉత్పత్తుల వాడకాన్ని పెంపొందించడం తప్పనిసరి అని పేర్కొన్నారు.అన్ని పార్టీలూ కలిసిరావాలి.రాజకీయ పార్టీలు కూడా విభేదాలను పక్కనబెట్టి స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహానికి దేశవ్యాప్తంగా విప్లవాత్మకంగా సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు. కేవలం భారతీయులు తయారు చేసిన వస్తువులనే కొనుగోలు చేస్తేనే దేశ ఆర్థికాభివృద్ధి దిశగా ముందడుగు వేయగలమని ఆయన అన్నారు.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!