సీతమ్మ వారి అంశగా హిందువుల నమ్మకం.

జైనబ్బీ దర్గా చరిత్ర, విశిష్టత
జైనబ్బీ దర్గా నిర్మాణానికి సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు లేనప్పటికీ, దీని గురించి ఒక ఆసక్తికరమైన కథనం స్థానికంగా ప్రచారంలో ఉంది. ఈ కథనం ప్రకారం, జైనబ్బీ అమ్మవారు కర్ణాటకలోని బీజాపూర్ ప్రాంతానికి చెందిన అపూర్వ సౌందర్యరాశి. దేశ పర్యటనలో భాగంగా ఆమె ఉరవకొండకు చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు బ్రిటిష్ సైనికులు ఆమెను దురుద్దేశంతో వెంబడించారు. వారి నుంచి తప్పించుకోవడానికి మార్గం లేక, జైనబ్బీ అమ్మవారు భూమాతను వేడుకున్నారు. దీంతో భూమి రెండుగా చీలి ఆమెను తనలోకి తీసుకుని, తిరిగి యథాస్థితికి చేరుకుంది.
ఈ విషయం తెలుసుకున్న సైనిక కమాండర్ అహంకారంతో ఆమెను దుర్భాషలాడగా, ఆయన దృష్టి కోల్పోయారు. తన తప్పు తెలుసుకుని, అమ్మవారిని పశ్చాత్తాపంతో వేడుకోగా, ఆమె ఆయనకు తిరిగి దృష్టి ప్రసాదించినట్లు చెబుతారు. ఆ కమాండరే ఆ ప్రదేశంలో సమాధిని నిర్మించినట్లు స్థానికంగా ప్రచారం ఉంది.
హిందువుల నమ్మకం ప్రకారం, జైనబ్బీ అమ్మవారు సీతమ్మవారి అంశ. అందుకే హిందువులు కూడా ఆమెను పూజిస్తారు. ప్రతి శుక్రవారం హిందూ, ముస్లిం భక్తులు ఇక్కడ కలిసి ప్రార్థనలు చేస్తూ, మత సామరస్యాన్ని చాటుతున్నారు.
Comments
Post a Comment