ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గాలు ఏర్పాటు చేయండి.

Malapati
0

 Uravakonda




​ ఉరవకొండ సమగ్ర అభివృద్ధికి రైలు మార్గం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గిరిజన సమైక్య సాధన అధ్యక్షులు మూడ్ కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు కే లాలెప్ప వేరువేరు ప్రకటనలో డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు-ఉరవకొండ-తుమకూరు మరియు గుంతకల్లు-కళ్యాణదుర్గం-మడకశిర-మధుగిరి రైలు మార్గాల నిర్మాణానికి వారు డిమాండ్ చేశారు.

​ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పూర్తిగా వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి రైలు మార్గాలు అత్యంత అవసరమన్నారు

 ఈ నేపథ్యంలో, గుంతకల్లు నుండి ఉరవకొండ మీదుగా కర్ణాటకలోని తుమకూరు వరకు బ్రాడ్ గేజ్ రైలు మార్గం నిర్మించాలని కేశవ్ నాయక్, లాలెప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్థికమంత్రులను వారు డిమాండ్ చేశారు.

​అదేవిధంగా, గుంతకల్లు నుండి కళ్యాణదుర్గం, మడకశిర మీదుగా కర్ణాటకలోని మధుగిరి వరకు మరో రైలు మార్గాన్ని కూడా నిర్మాణ ఆవశ్యకత ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు మార్గాల నిర్మాణం ఈ ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇది ఉరవకొండ నియోజకవర్గంతో పాటు వందలాది గ్రామాల ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతమిస్తుంది.

​ఈ రైలు మార్గాల సాధన కోసం తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా 

పాలకుల దృష్టికి తీసుకొనివెళతామన్నారు.

. ఉరవకొండ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి, ఈ ప్రాజెక్టును త్వరగా చేపట్టేందుకు పూర్తి శ్రద్ధ పెట్టాలని గిరిజన ఐక్య సాధన సమితి మూడు కేశవ నాయక్, రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షులు లాలెప్పలు అభ్యర్థించారు..

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!