ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వ్యాధి ప్రాణాలు బలితీస్తూనే ఉంది. డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదిక ప్రకారం, ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరు రేబిస్ వల్ల మృతి చెందుతున్నారు. ఇందులో మూడవ వంతు మరణాలు భారతదేశంలోనే సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
2023లో భారతదేశంలోనే 284 మంది రేబిస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండటం ఈ దుస్థితికి ప్రధాన కారణమని పార్లమెంట్‌కు సమర్పించిన ఐడీఎస్‌పీ (ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) నివేదిక స్పష్టం చేసింది.
పలు దేశాలు ఇప్పటికే 70% వాక్సినేషన్ లక్ష్యం సాధించి రేబిస్ నియంత్రణలో విజయవంతమయ్యాయి. అదే విధంగా భారత్ కూడా ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అలాగే రేబిస్ నివారణకు వెంటనే వాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం అత్యవసరం అని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

Comments
Post a Comment