అమరావతి : బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. రేపటినాటికి అక్కడ ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని, అది బుధవారానికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక ఉత్తరాంధ్ర, నంద్యాల జిల్లాల్లో ఇప్పటికే వర్షం పరిస్థితులు ఏర్పడుతున్నాయని, నేడు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
⚠️ అధికారులు ప్రజలు వర్షాలు, గాలులకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
