పరువు నష్టం నేరం కాదు.. మార్పులు అవసరం: సుప్రీంకోర్టు

Malapati
0

 



పరువు నష్టం చట్టాన్ని నేరరహితం చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు వ్యాఖ్య


'ది వైర్' న్యూస్ పోర్టల్ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణకు అంగీకారం

జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్ వేసిన పరువు నష్టం కేసును సవాల్ చేసిన జర్నలిస్టులు

ఇదే అంశంపై రాహుల్ గాంధీ పిటిషన్ కూడా పెండింగ్‌లో ఉందని గుర్తు చేసిన కపిల్ సిబాల్

అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్నట్లు ప్రకటించిన సుప్రీం ధర్మాసనం

పరువు నష్టం చట్టాన్ని నేరరహితంగా మార్చాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ న్యూస్ పోర్టల్ 'ది వైర్' సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సందర్భంగా ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 'ది వైర్' న్యూస్ పోర్టల్‌లో ప్రచురితమైన కొన్ని కథనాలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించాయని ఆరోపిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) మాజీ ప్రొఫెసర్ అమితా సింగ్ క్రిమినల్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో 'ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం' (ది వైర్ మాతృసంస్థ), దాని ఎడిటర్ అజోయ్ ఆశీర్వాద్‌లకు జారీ అయిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. క్రిమినల్ పరువు నష్టం చట్టానికి సంబంధించిన ఇదే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లు కూడా సర్వోన్నత న్యాయస్థానంలో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ తాజా పిటిషన్‌ను కూడా పాత పిటిషన్లతో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది.

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!