లై సెన్స్ కళ్యాణ దుర్గంమున్సిపాలిటీలో లో.. నిర్వహణ ఉరవకొండ గ్రామ పంచాయితీ లో
-ఊరురా బెల్ట్ షాపులు, నిర్వాహకులదే రాజ్యమా?
నో డాకుమెంట్స్, నో నోటిఫికేషన్స్
ఉరవకొండ: అనంతపురం జిల్లా పరిధిలోని ఉరవకొండలో ఇటీవల కొత్తగా ప్రారంభించిన ఓ బార్ అండ్ రెస్టారెంట్ స్థానికంగా తీవ్ర వివాదానికి దారితీసింది. ఎటువంటి చట్టపరమైన అనుమతులు (జీఓ) లేకుండా, కేవలం ఎక్సైజ్ అధికారుల అండదండలతో, భారీ లంచాలతో ఈ బార్ నడుస్తోందని స్థానిక వ్యాపారులు, పౌరులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిణామంతో తమ వ్యాపారాలు దెబ్బతిని, తమ జీవనం ప్రమాదంలో పడిందని స్థానిక మద్యం షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా బార్ నిర్వహణ ఎక్సైజ్ చట్టాల ప్రకారం, గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తగా బార్‌ను ఏర్పాటు చేయాలంటే మంత్రివర్గ స్థాయి ఆమోదంతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) తప్పనిసరి. అయితే, ఉరుకొండలో గత నాలుగు రోజులుగా నడుస్తున్న ఈ కొత్త బార్‌కు సంబంధించి ఎటువంటి అధికారిక పత్రాలు గానీ, నోటిఫికేషన్లు గానీ లేవని స్థానిక వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. వ్యాపారులు ప్రశ్నించగా, పైస్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు మాత్రమే వచ్చాయని ఎక్సైజ్ అధికారులు సమాధానమిచ్చినట్లు సమాచారం. అంతేకాక, కల్యాణదుర్గం పరిధిలోని మద్యం స్టాక్‌ను ఇక్కడికి తరలించి అక్రమంగా విక్రయాలు జరుపుతున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా చితికిపోతున్న వ్యాపారులు ఈ అక్రమ బార్‌తో ఇప్పటికే లక్షలాది రూపాయల పెట్టుబడితో వ్యాపారం చేస్తున్న స్థానిక రెండు మద్యం షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయి. "కొత్త బార్ రాకతో మా విక్రయాలు ఒక్కసారిగా 50–60 శాతం పడిపోయాయి. ఇలాగే కొనసాగితే మా కుటుంబాలు, మాతో భాగస్వాములుగా ఉన్న అనేక మంది జీవనం నాశనమవుతుంది" అని వ్యాపారులు వాపోయారు. ఈ రెండు షాపులపై ఆధారపడిన మొత్తం 70 మందికి పైగా భాగస్వాముల పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయని వారు తెలిపారు. ఈ వ్యవహారం వెనుక మద్యం మాఫియా మరియు కొంతమంది రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ లో ఏళ్ళ తరబడి ఉంటూ ఆర్ధికంగా చితికి పోయామని అయితే రెండు మూడు షాపులు పొందిన వ్యక్తులు /స్థానికేతరులు పెత్తనం చేలాయిండం పై సర్వత్రా విమర్శలు వెలువెత్తు తున్నాయి.ఈ కొత్త బార్‌ను నిర్వహిస్తున్నారని, వీరి ప్రభావం ఇప్పటికే 40 గ్రామాలకు విస్తరించిందని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. స్పందించని ఉన్నతాధికారులు: మీడియా ద్వారా మొర చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఈ బార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత మూడు రోజులుగా ఉన్నతాధికారులను సంప్రదించినా ఎటువంటి స్పందన రాలేదని బాధితులు పేర్కొన్నారు. తమ గోడును వినిపించుకోవడానికి చివరికి మీడియాను ఆశ్రయించినట్లు వారు తెలిపారు. తక్షణమే ఈ చట్టవిరుద్ధ బార్‌ను మూసివేయించి, తమ వ్యాపారాలను కాపాడాలని వ్యాపారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Comments
Post a Comment