జనగణనలో కుల గణన చేపట్టాలి

Malapati
0



 

అనంతపురం:

  జన గణనలో కుల గణన చేపట్టాలని బీసీ కులాల జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయించాలని సిపిఐ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి అధ్యక్షతన ఎన్జీవో హోంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాజకీయ పార్టీలు కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సలహాలు సూచనలు తెలియజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ఐదు నుండి 15% మధ్యలో ఉన్న అగ్రకులాల నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు కానీ 50 నుంచి 70 శాతం మధ్యలో ఉన్న బీసీ కులాల నాయకులు చిన్నచిన్న పోస్టులకు అగ్రకులాల వారిని అడుక్కున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని మండిపడ్డారు. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయన్నారు గత స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బీసీలు కోల్పోయారని పేర్కొన్నారు. ఇటేవలే తెలంగాణ ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టడం వలన ఏఏ కులాలు ఎంతమంది ఉన్నది అని లెక్క తేల్చింది అందుకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు స్థానిక సంస్థలలో ఎన్నికలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదించారని తెలిపారు తదిపర గవర్నర్ ను కలిసి ఆమోదించవలసిందిగా కోరారు.. గవర్నర్ కూడా దాన్ని ఆమోదించడం జరిగిందని తెలిపారు. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు బీసీలను ఎన్నికల సమయంలో జపం చేస్తూనే మరోవైపు కుల గణన చేపట్టడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వెనుకబడిన కులాల హక్కులను సాధించుకోవడానికి బీసీ ఎస్సీ, ఎస్టీ మైనారిటీ కుల సంఘాలను ఆహ్వానించి రౌండ్ టేబుల్ ద్వారా కార్యాచరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు తక్షణమే జనగణలో కుల గణన చేపట్టి స్థానిక సంస్థలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.. ఈ అంశం పైన అక్టోబర్ 4వ తేదీన అనంతపురం నగరంలో సదస్సు నిర్వహించడం జరుగుతుందని ఈ సదస్సుకు జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు తరలిరావాలని పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జగదీష్ మాజీ పార్లమెంట్ సభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తలారి రంగయ్య రిటైర్డ్ జడ్జ్ కిష్టప్ప మాజీ మేయర్ రాగే పరశురాం సిపిఎం పార్టీ నాయకులు బాలరంగయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు సాకే శంకర్ బీసీ సంఘాల రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు సాకే హరి బీఎస్పీ నాయకులు గోవిందు ఆర్ఎస్పి నాయకులు శ్రీరాములు కురుబ సంఘం నాయకులు శివ బాల లింగమూర్తి బోరంపల్లి ఆంజనేయులు వాల్మీకి సంఘం రాష్ట్ర నాయకులు బ్రహ్మయ్య కొడెర్ల సంఘం నాయకులు గోపాలు కృష్ణ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సురేంద్ర విష్ణు ఆర్ఇఎఫ్ నాయకులు నాగభూషణం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున రాజారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యు శ్రీరాములు రామకృష్ణ గోపాల్ జిల్లా కార్యవర్గ సభ్యులు గోవిందు లింగమయ్య రమణ సంతోష్ కుమార్ రాజేష్ రమేష్ మల్లికార్జున నాగార్జున కుళ్లాయిస్వామి పెద్దయ్య పార్వతీ ప్రసాద్ చేన్నప్పయాదవ్ సిపిఐ నాయకులు అల్లిపీరా ఎల్లుట్ల నారాయణస్వామి నరేష్ చిత్తర్చేడు రామాంజనేయులు జానకి తదితరులు పాల్గొన్నారు*

Tags

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!