పెద్దకొట్టాలపల్లి (ఉరవకొండ): దోమల బెడదను నివారించి, ప్రజలను వ్యాధుల బారి నుండి కాపాడే ఉద్దేశ్యంతో పెద్దకొట్టాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో గురువారం ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ జయకుమార్ నాయక్ ఆదేశాల మేరకు, ఉరవకొండ సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
గ్రామ పంచాయతీ కార్యదర్శి మునఫ్ పర్యవేక్షణలో పంచాయతీ సిబ్బందితో కలిసి, గ్రామంలోని ప్రతి వీధిలోనూ పెరి త్రయం అనే మందుతో ఫాగింగ్ చేశారు. ఈ పొగ వలన డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులను కలిగించే దోమలు చనిపోతాయి. గ్రామంలో దోమల సంఖ్యను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ ఫాగింగ్ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు శ్రీనివాసులు, లక్ష్మీదేవి, ఎం.ఎల్.హెచ్.పి. రోషిణి, మరియు ఆశా కార్యకర్తలు నాగమ్మ, మహాలక్ష్మితో పాటు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు దోమల నుండి రక్షణ పొందేందుకు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆరోగ్య కార్యకర్తలు సూచించారు.

Comments
Post a Comment