చాభాల:
అనంతపురం జిల్లా, వజ్రకరూరు: వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో వెలిసిన ప్రసిద్ధ శ్రీశ్రీశ్రీ చాబాల దర్గా వన్నూరు స్వామి దేవాలయం పునర్నిర్మాణానికి స్థానిక కుటుంబం ఒకటి పెద్ద మొత్తంలో విరాళాన్ని అందజేసింది. కీ.శే. చల్ల సంజీవ రెడ్డి గారి కుమారులైన కీ.శే. చల్ల ఆంజనేయులు గారి కుటుంబ సభ్యులు రూ. 50,116 మొత్తాన్ని విరాళంగా అందజేశారు.
ఈ విరాళాన్ని గురువారం ఉదయం 11 గంటల సమయంలో చల్ల ఆంజనేయులు గారి కుటుంబ సభ్యులు ఆలయ ధర్మకర్తలు అయిన శివలింగప్ప, ధనుంజయ, కేరా పరమేష్లకు అందజేశారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజలు, భక్తుల సమక్షంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు మరియు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో మాజీ సర్పంచ్ సి. ఎర్రిస్వామి, లింగమూర్తి, చికెన్ సెంటర్ అశోక్, తలారీ చెన్నప్ప, కొలిమి మొహమ్మద్, మగ్గం మూర్తి, జీకే రాంబాబుతో పాటు గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ విరాళం ఆలయ పునర్నిర్మాణ పనులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామంలోని భక్తులు, ప్రజలు ముందుకు వచ్చి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు ధర్మకర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

Comments
Post a Comment