మండల విద్యాశాఖ అధికారులు తమకు తామే దసరా సెలవులు ప్రకటించుకున్న వైనం
అనంతపురం నగరానికి అనుకుని ఉన్న కూడేరు మండలంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో మండల విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలం. తమకు తామే సెలవు ప్రకటించుకుని విధులకు డుమ్మా కొట్టిన వైనం. రెండు నెలల క్రితం సమాచార హక్కు చట్టం కింద సమాచారం కావాలని దరఖాస్తు చేసుకున్న ఇప్పటివరకు స్పందించని వైనం. విషయం కనుక్కోవడానికి వెళ్తే అయ్యవారు గదికి తాళాలు. సిబ్బందిని అడిగితే దసరా సెలవులు ఉన్నాయి కదా సెలవులు అయ్యాక మరోసారి రండి అంటూ విద్యార్థి సంఘం నేతకు సమాచారం ఇచ్చారు. అంటే దాదాపు రెండు మూడు రోజుల నుంచి విధులకు డుమ్మా కొడుతున్నారని స్థానికుల సమాచారం. వీరిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకునేనా...? లేక వ్యవహరిస్తారా..? ప్రజల పన్నుల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా పక్కదారి పట్టిన విద్యాశాఖ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐఎఫ్డిఎస్ విద్యార్థి సంఘం డిమాండ్..చేశారు
