కర్నూలు: న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు ప్రజా సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది. కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఆసిఫ్, టి.వెంకటేష్, రాము ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షా శిబిరాన్ని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు సందర్శించారు.
ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి, డేవిడ్, పీవోపీ నాయకుడు శ్రీనివాస రావు న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. న్యాయవాదుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారి పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తామంతా న్యాయవాదులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు
.

Comments
Post a Comment