పూతలపట్టు సెప్టెంబర్ : ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమితులైన జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై ఫోర్స్ మహేష్ గాని మదనపల్లి కేంద్రంలో ఉన్న ఎంజి గ్రాండ్ నందు పూతలపట్టు జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. ఎం మహేష్ స్వేరో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా జనసేన పార్టీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్నటువంటి సీనియర్ నాయకులు జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మై పోస్ట్ మహేష్ గారిని ఏపీఐఐసీ డైరెక్టర్గా నియమించడం శుభసూచకమని భవిష్యత్తులో ఉమ్మడి చిత్తూరు జిల్లా, పరిసర జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి దిశగా అడుగులు వేయడానికి మహేష్ గారు రెట్టింపు స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి,అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉందని,ఇలాంటి యువ నాయకుడికి అవకాశం కల్పించడం హర్షణీయం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య,జిల్లా నాయకులు ఎం మహేష్ స్వేరో,యాదమరి మండల అధ్యక్షులు కుమార్,యాదమరి మండల కార్యదర్శి వేముల పవన్,తవణంపల్లి మండల ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు చిన్న,అజిత్ శ్రీరాముల,అనిల్ కుమార్,ప్రభాకర్,టీ ఎన్ ఎస్ ప్రసాద్,త్రినాథ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ ని ఘనంగా సన్మానించిన పూతలపట్టు జనసేన నాయకులు.
September 28, 2025
0
