ట్రా
ఫిక్ లోఆవులతో అవస్థలు.ప్రమాదాలకు హేతువులు
-నిబంధనలకు నీళ్లు పట్టించుకోని పోలీసులు- సోమవారాలు, పండగలపూట ట్రాఫిక్ జామ్
- రోడ్డు మీదే అడ్డగోలుగా వాహనాలు పార్కింగ్మా
ట్రాఫిక్ లో ఆవులు ప్రమాదాలకు హేతువులుగా మారాయని వాహన చోదకులు ఆరోపిస్తున్నారు వారం రోజుల క్రితం బూదగవి గ్రామ సమీపంలో అడ్డొచ్చినవో బర్రెను ఢీకొని ఓ విలేకరి మృతి చెందారు. పట్టణంలో పట్టణ శివార్లలో అడుగడుగునా ఆవులు వాహన చోదకులకు ప్రమాదహేతువులుగా మారాయి . వీటిని నియంత్రించే దిశగా తక్షణమే వాహన యజమానులపై కేసులు నమోదు చేయాలని ప్రజలు వాహన చోదకులు కోరుతున్నారు.
ఉరవకొండ పట్టణంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. నిబంధనలకు నీళ్లు వదిలిన పోలీసులు పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు సర్వత్రా వెళ్ళు వెత్తుతున్నాయి. రిక్రియేషన్ క్లబ్బు పక్కన ఓ మెకానిక్ ఏకంగా సగం రోడ్డు మీదే వాహనాలు పార్కింగ్ చేస్తూ మరమ్మత్తులు చేస్తూ ప్రధాన ప్రతిబంధం కంగా మారాడు. ఇది ప్రధాన అన్నికార్యాలయాలకు వెళ్లే రహదారి. అయితే పోలీసులు నియంత్రణ చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. నిత్యం వాహన రాకపోకులకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
ఇక గడియార స్తంభం చుట్టూ చిన్నాచితకా,వ్యాపారస్తులు రోడ్డు మీదనే అమ్మకాలు కొనుగోలు సాగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే గడియార స్తంభం రహదారి అంచున వ్యాపారస్తులు కాయగూరలు విక్రయిస్తున్నారు. గంపల్లోనే కాకుండా పూలు, పళ్ళు తోపుడుబండ్లపై విక్రయిస్తూ ట్రాఫిక్కు నిత్యం అంతరాయం కలిగిస్తున్నారు. తెలుగు తల్లి విగ్రహం చుట్టూ గడియార స్తంభం చుట్టూ ఆకుకూరల వ్యాపారులు రహదారి అంచున విక్రయిస్తూ వాహన ప్రమాదాలకు కారకలవుతున్నారు. ఇదే మార్గంలో చర్చి ప్రాంతం వరకు దారి పొడుగునా తోపుడుబండ్లు దర్శనమిస్తాయి. వచ్చి పోయే వాహనాలకు హారన్ మోగించిన పట్టించుకోరు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించిపోతోంది. క్లియర్ కావాలంటే, చేయాలంటే గంటలు తరబడి సమయం వృథా అవుతోంది. టవర్ క్లాక్ ప్రాంతంలోజోరుగా స్వీట్స్ విక్రయాలు, ఫ్రూట్స్ విక్రయాలు తోపుడుబండ్ల,విక్రయాలతో వాహన చోదకులు బేంబేలు ఎత్తిపోతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా కాయగూరల మార్కెట్ సౌకర్యం లేక వారు తోపుడు బండ్ల పై,రోడ్లపై యాతేచ్చగా విక్రయాలు సాగిస్తున్న అడిగే వారే లేకపోయారు. గతంలో కాయగూరల వ్యాపారాలకు కేటాయించిన స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసుకొని అందులో మండి వ్యాపారం సాగిస్తున్నారు.. చిల్లర మల్లర వ్యాపారస్తులు,రోడ్లపై విక్రయాలు సాగించాల్సిన దుస్థితి ఏర్పడింది.అటు పంచాయతీ పాలకవర్గం,అధికారులు గానీ,పోలీసులు గానీజోక్యం కలిగించుకుంటే సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది. అయితే వారు అంటి ముట్టనట్టుగా వ్యవహరించడంతో ట్రాఫిక్ సమస్య జటి లమవుతోంది.. ఇక చర్చి ప్రాంతం నుంచిపాత స్టేట్ బ్యాంకు వరకు రహదారి ఇరుకున ఉంది.ఇరువైపులా అడ్డగోలు వ్యాపారాలతో ట్రాఫిక్ సమస్య అడుగడుగునా తలెత్తుతోంది.
సోమవారాలు,పండుగ రోజుల్లో రద్దీగా ఉంటుంది. పోలీసులు ట్రాఫిక్ చర్యల జోలికి అసలే వెళ్లడం లేదు. గడియార స్తంభం నుంచి చాబా ల వైపు వెళ్లే రాస్తా ఇరువైపులా ఆటోల నిలుపుదల, ద్విచక్ర వాహనాలు కార్లు ఎక్కడపడితే అక్కడ విరుద్ధంగా నిలుపుదల చేస్తే, వైయస్ విగ్రహం ముందు, పక్కన ఆటోలు సగం రోడ్డును దురాక్రమించుకొని పార్కింగ్ చేస్తారు. గుంతకల్లు వెళ్లే రాస్తా ఇరువైపులా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. పాత బస్టాండులో పూలు, పండ్ల వ్యాపారులతో ట్రాఫిక్ అష్టదిగ్బంధనంలో ఉంది.
నానాటికి పెరుగుతున్న జనాభా, వాహన సంచారంతో ఉరవకొండలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంటుంది.
రిక్రియేషన్ క్లబ్బు పక్కన మెకానిక్ రోడ్డుపై అడ్డగోలు, వాహన పార్కింగ్ అడ్డగోలు మెకానిక్ పనులతో, ట్రాఫిక్ ప్రమాదాలకు గురి కావాల్సిన వస్తోంది.
పంచాయతీ పాలకవర్గం అధికారులు పోలీసులు స్పందించి ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Comments
Post a Comment