ఆంధ్రా, అనంతపురం: ఉరవకొండ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు ఎక్సైజ్ కేసులలో పట్టుబడి, ప్రభుత్వానికి జప్తు అయిన ఆరు వాహనాలకు బహిరంగ వేలం నిర్వహించారు. అనంతపురం అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీమతి రేవతి ఆధ్వర్యంలో ఉరవకొండ ఎక్సైజ్ స్టేషన్‌లో ఈ వేలం జరిగింది. ఈ వేలంలో మూడు ద్విచక్ర వాహనాలను రూ. 15,800కి మరియు జీఎస్టీ రూ. 2,842కి బిడ్డర్లు కొనుగోలు చేశారు. మరో మూడు వాహనాలకు బిడ్డింగ్‌లు రాలేదు.
మద్యం ప్రాపర్టీ డెస్ట్రక్షన్
అదేవిధంగా, వివిధ కేసులలో పట్టుబడిన 6.6 లీటర్ల నాటుసారా, 6.8 లీటర్ల ఎన్డీపీఎల్ (NDPL), మరియు 8.1 లీటర్ల డీపీఎల్ (DPL) ను ఎక్సైజ్ సిబ్బంది ధ్వంసం చేశారు. అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఎక్సైజ్ చెక్ పోస్టులు, వైన్ షాపుల తనిఖీ
అనంతపురం అసిస్టెంట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శుక్రవారం విడపనకల్లు మండలం పరిధిలోని విడపనకల్లు మరియు దొనేకల్లు ఎక్సైజ్ చెక్ పోస్టులను తనిఖీ చేశారు. కర్ణాటక నుండి వచ్చే వాహనాలను కఠినంగా తనిఖీ చేసి, అక్రమ మద్యం రవాణాను అరికట్టాలని చెక్ పోస్ట్ అధికారులు శ్రీరాములు మరియు శ్రీలతలకు ఆమె ఆదేశించారు. తదుపరి ఆమె విడపనకల్లు వైన్ షాపును కూడా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఉరవకొండ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రవిచంద్ర మరియు ఎస్ఐ వీరస్వామి కూడా పాల్గొన్నారు.



Comments
Post a Comment