-ఓ వైద్యుడు, నర్సు పై వేటు కు రంగం సిద్ధం.
-కొట్టాలపల్లి పీ హెచ్ సీ ఆకస్మిక తనిఖీ, అందుబాటు లో లేని సిబ్బంది గురించి ఆరా.
ట్రూ టైమ్స్ ఇండియా :ఓ డాక్టర్, నర్స్ నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి ఘటన, మరియు కొట్టాలపల్లి పీ హెచ్ సీ సిబ్బంది అందుబాటులో లేరని వచ్చిన ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారులు( త్రి సభ్యులతో కూడిన బృంద )విచారణ చేపట్టారు.
ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఈనెల 26వ తేదీన వజ్ర కరూర మండలం చాబాల గ్రామానికి చెందిన ఆహారన్ అనే ఐదు సంవత్సరాల బాలుడు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించారు. అందులో భాగంగా సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భ్రమరాంబికాదేవి, డిసిహెచ్ఎస్ డేవిడ్ సెల్వ రాజు, మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పీడియాట్రికల్ డాక్టర్ ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి గతంలో ఆ బాలుడు ఎక్కడ వైద్య చికిత్స చేయించుకున్నారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి చికిత్స అందించారు విధుల్లో ఉన్న డాక్టర్లు సిబ్బంది ఎలా వ్యవహరించారు. ఎలాంటి మందులు ఇచ్చారు. తదితర అనేక అంశాలపై సమగ్ర విచారణ చేపట్టారు. ఈ విచారణలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ చౌదరి, ఆరోజు విధుల్లో ఉన్న డాక్టర్ ఇస్మాయిల్, మరియు వైద్య సిబ్బందిని వారు విడివిడిగా విచారణ చేశారు. విచారణకు సంబంధించిన నివేదికలను జిల్లా కలెక్టర్కు అందివ్వునున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భ్రమరాంబ దేవి, జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డేవిడ్ సెల్వ రాజు తెలిపారు.అనంతరం వారు పెద్ద కొట్టాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ కి వెళ్లారు. సిబ్బంది అందుబాటులో లేరని, ముందస్తు విధులు ముగించుకొని వెళ్ళు తున్నారని వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు.



Comments
Post a Comment